Chandrababu: రాజమండ్రి సిటీలో హై టెన్షన్.. జైలులో స్నేహం బ్లాక్ సిద్దం .. 

By Rajesh Karampoori  |  First Published Sep 11, 2023, 12:56 AM IST

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయనను విజయవాడ నుంచి రాజమండ్రి రోడ్డు మార్గంలో సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు.


ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ ఉద్రిక్తత పరిస్ధితుల నేపథ్యంలో విజయవాడ నుంచి రాజమండ్రి రోడ్డు మార్గంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

మరి కాసేపట్లో చంద్రబాబు రాజమండ్రి జైలుకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో రాజమండ్రిలో సెక్షన్ 30ని అమలు చేస్తున్నారు. రాజమండ్రి నగరవ వ్యాప్తంగా 36 పోలీస్ పికటింగ్ లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా చంద్రబాబు నాయుడుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆయనను స్నేహం బ్లాక్ లో ఉంచనున్నట్లు సమాచారం.

Latest Videos

click me!