పెరుగుతున్న కరోనా కేసులు.. తెలంగాణతో సహా 7 రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. కీలక సూచనలు..

Published : Aug 06, 2022, 03:17 PM IST
పెరుగుతున్న కరోనా కేసులు.. తెలంగాణతో సహా 7 రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. కీలక సూచనలు..

సారాంశం

దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులలో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులలో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిర్దారణ పరీక్షలను, వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని దేశంలోని 7 రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఈ జాబితాలో కర్ణాటక, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్, యాంటీజెన్‌ పరీక్షలకు సంబంధించి సిఫార్సు చేసిన వాటాను కొనసాగించాలని పేర్కొంది. 

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు రాసిన లేఖలో.. పండుగ సీజన్ ప్రారంభం కానున్నందున రాబోయే నెలల్లో పెద్దఎత్తున ప్రజలు గుమికూడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అంతరాష్ట్ర ప్రయాణాలు కొనసాగించవచ్చని తెలిపారు. సామూహిక సమావేశాలు అంటు వ్యాధుల వ్యాప్తిని సులభతరం చేయగలవని తెలిపారు. రాష్ట్రాలు  జిల్లాలన్నింటిలో తగిన పరీక్షలు నిర్వహించేలా చూసుకోవడం చాలా కీలకమని పేర్కొన్నారు. ఇన్‌ఫెక్షన్ మరింతగా వ్యాప్తి చెందకుండా.. అధిక కేసులు, సానుకూలత రేట్లు, క్లస్టర్‌లను నివేదించే జిల్లాలను కూడా రాష్ట్రాలు నిశితంగా పర్యవేక్షించాలని కోరారు. 

ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 19,406 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా మొత్తం కేసుల సంఖ్య 4,41,26,994కి పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 49 మంది మరణించగా.. మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,26,649కి చేరుకుంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 19,928 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,34,65,552కి పెరిగింది.దేశంలో ప్రస్తుతం 1,34,793 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు