సుబ్రమణ్యస్వామికి తగిన భద్రత కల్పించాం.. హైకోర్టుకు వివరించిన కేంద్రం 

Published : Nov 03, 2022, 04:28 PM IST
సుబ్రమణ్యస్వామికి తగిన భద్రత కల్పించాం.. హైకోర్టుకు వివరించిన కేంద్రం 

సారాంశం

బిజెపి రాజ్యసభ మాజీ ఎంపి సుబ్రమణ్యస్వామి నివాసం వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అలాగే.. ఆయనకు 'జెడ్' కేటగిరీ బాడీ గార్డు కూడా ఉన్నట్టు కేంద్రం తెలియజేసింది. ఆయన  భద్రత విషయంలో భద్రతా సంస్థలు సంతృప్తి చెందాయని అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి రాజ్యసభ మాజీ ఎంపి సుబ్రమణ్యస్వామికి భద్రత విషయంలో వివాదం చేలరేగింది. తన వ్యక్తిగత నివాసానికి తగిన భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖాలు చేసిన పిటిషన్ ను గురువారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోని సుబ్రమణ్యస్వామి నివాసం వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

అలాగే.. ఆయనకు 'జెడ్' కేటగిరీ బాడీ గార్డును ఏర్పాటు చేసినట్టు వివరించింది. ఈ సమయంలో ఆయనకు భద్రతకు తగిన ఏర్పాట్లపై భద్రతా సంస్థలు కూడా సంతృప్తి చేస్తున్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ తెలిపారు.  తన వ్యక్తిగత నివాసానికి తగిన భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన మాజీ కేంద్ర మంత్రి భద్రతకు సంబంధించి సమగ్ర అఫిడవిట్‌ను సమర్పించాలని జస్టిస్ యశ్వంత్ వర్మ ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

సుబ్రమణ్యస్వామి ఢిల్లీలోని తన వ్యక్తిగత గృహంలో సరైన రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలమైందని స్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 14న లూటీన్ ఢిల్లీలోని ప్రభుత్వ వసతిని ఖాళీ చేయడానికి ఆరు వారాల సమయం ఇచ్చిన తర్వాత ఈ కేసు తెరపైకి వచ్చింది.

సుబ్రమణ్యస్వామికి 2016లో వసతి కల్పించారు. రాజ్యసభ ఎంపీగా ఆయన పదవీకాలం ఏప్రిల్‌లో ముగియినప్పటికీ, ఆయన బంగ్లా AB-14 లోనే ఉంటున్నారు. బంగ్లాను మళ్లీ కేటాయించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇది వాస్తవానికి భద్రతా కారణాల దృష్ట్యా తనకు కేటాయించబడిందని, రాజకీయ కార్యకలాపాల కారణంగా తనకు ఇప్పటికీ ముప్పు ఉందని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

అయితే ఆయన విజ్ఞప్తిని వ్యతిరేకించిన కేంద్రం ఆ బంగ్లాను ఇతర మంత్రులు, ఎంపీలకు కేటాయించాలని పేర్కొంది. స్వామికి జెడ్-కేటగిరీ భద్రతను తగ్గించలేదని, గడువు ముగిసిందని కేంద్రం తరఫు న్యాయవాది అశీష్ జైన్ అన్నారు. నివాసం ఉంచుకోవాలన్న స్వామి అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు, నిజాముద్దీన్ ఈస్ట్‌లో అతనికి ప్రైవేట్ నివాసం ఉందని కోర్టు దృష్టికి తెచ్చింది. అక్కడ ఆయనకు భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?