కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నేడు కేంద్రంతో చర్చలు..!

By telugu news teamFirst Published Dec 1, 2020, 10:31 AM IST
Highlights

ఢిల్లీలోకి వారిని అనుమతించకుండా చాలా ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించలేదు. ఎట్టకేలకు రైతులు ఢిల్లీలోకి ప్రవేశించారు. కాగా.. నేటికి వారి ఆందోళనలు ఆరో రోజుకి చేరుకున్నాయి.
 

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. రైతులు చేస్తున్న ఆందోళన ఆరో రోజుకి చేరింది. పంజాబ్ సహా పలు రాష్ట్రాల రైతుల సంఘాలు ఇటీవల ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీలోకి వారిని అనుమతించకుండా చాలా ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించలేదు. ఎట్టకేలకు రైతులు ఢిల్లీలోకి ప్రవేశించారు. కాగా.. నేటికి వారి ఆందోళనలు ఆరో రోజుకి చేరుకున్నాయి.

కేంద్రం విజ్ఞప్తికి చలించకుండా రైతులు తమ డిమాండ్లు వినేంతవరకూ ఆందోళన కొనసాగించేందుకు పట్టుదలగా ఉన్నారు. దీంతో చర్చల విషయంలో ప్రతిష్టంభన తలెత్తింది. అయితే, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రైతులను చర్చలకు ఆహ్వానించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర  సింగ్ తోమర్ సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. దీనికి ముందు ఈనెల 3వ తేదీన సమావేశం తేదీని మంత్రి ఖరారు చేశారు.

'డిసెంబర్ 3న సమావేశం జరపాలని గత నవంబర్ 13న నిర్ణయం తీసుకున్నాం. అయితే రైతులు ఆందోళన వైపే మొగ్గుచూపుతున్నారు. ఆ కారణంగా రైతు ప్రతినిధులతో డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో సమావేశం జరపాలని నిర్ణయించాం. చలి వాతావరణంతో పాటు కరోనా వైరస్ కూడా ఉంది. దయచేసి నిరసనలకు స్వస్తి చెప్పండి. చర్చల ద్వారా ఒక పరిష్కారం కనుగొందాం' అని నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు.

click me!