వీధి కుక్కల సమస్యపై కొత్త బిల్లును సిద్ధం చేస్తున్న కేంద్రం.. !

Published : Jun 28, 2023, 10:47 AM ISTUpdated : Jun 28, 2023, 10:48 AM IST
వీధి కుక్కల సమస్యపై కొత్త బిల్లును సిద్ధం చేస్తున్న కేంద్రం.. !

సారాంశం

New Delhi: దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీధి కుక్కలకు సంబంధించిన సంఘటనల మధ్య ఇటీవల సవరించిన జంతు జనన నియంత్రణ నిబంధనలను కొన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకించడంపై కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా స్పందిస్తూ.. దీనికి సంబంధించి కొత్త బిల్లు సిద్ధంగా ఉందని చెప్పారు. "అది క్లియర్ అయ్యాక ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం జంతు సంక్షేమ బోర్డు ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర, స్థానిక సంస్థలకు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుత చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని పలువురు సూచించారని" తెలిపారు.  

Union Minister for Animal Husbandry Parshottam Rupala: ఇటీవ‌లి కాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో వీధి కుక్క‌ల దాడుల ఘ‌ట‌న‌లు అనేకం చోటుచేసుకున్నాయి. దీనిపై ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌ల నుంచి విన్న‌తులు పెరుగుతుండ‌టంపై స్పందిస్తూ.. వీధికుక్కల బెడదపై కేంద్రం త్వరలో చట్టం రూపొందిస్తుందని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. గత తొమ్మిదేళ్లలో పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ సాధించిన కీలక విజయాలు, కార్యక్రమాలపై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత తొమ్మిదేళ్లలో ఈ రంగం 6 శాతానికి పైగా వృద్ధిని సాధించిందనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 7 శాతానికి చేరుకుంటుందని ఆయన అన్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీధి కుక్కలకు సంబంధించిన సంఘటనలు, ఇటీవల సవరించిన జంతు జనన నియంత్రణ నిబంధనలను కొన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకించడంపై  కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా స్పందిస్తూ.. దీనికి సంబంధించి కొత్త బిల్లు సిద్ధంగా ఉందని చెప్పారు. "అది క్లియర్ అయ్యాక ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం జంతు సంక్షేమ బోర్డు ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర, స్థానిక సంస్థలకు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుత చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని పలువురు సూచించారని" తెలిపారు.

అలాగే, కిసాన్ క్రెడిట్ కార్డుల ప్రయోజనాలను పాడి రైతులకు విస్తరించడం, ప‌శువుల చర్మవ్యాధులకు ఉచితంగా టీకాలు వేయడం గత తొమ్మిదేళ్లలో కేంద్రం సాధించిన రెండు ప్రధాన విజయాలు అని రూపాలా అన్నారు. పాడి పరిశ్రమ జాతీయ ఆర్థిక వ్యవస్థలో 5% భాగస్వామ్యం వహిస్తోందనీ, 8 కోట్ల మందికి పైగా రైతులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. ప్రపంచ పాల ఉత్పత్తిలో 23 శాతంతో పాల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉందన్నారు. పాల ఉత్పత్తి 2014-15లో 146.3 మిలియన్ టన్నుల నుంచి 2021-22లో 221.06 మిలియన్ టన్నులకు పెరిగింది. తలసరి పాల లభ్యత 2021-22లో రోజుకు 444 గ్రాములు కాగా, 2021లో ప్రపంచ సగటు రోజుకు 394 గ్రాములుగా ఉంది.

పాలు, పాల ఉత్పత్తుల కొరత ఉందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. పాల ధరల పెరుగుదల సమస్యను పరిష్కరించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని మంద్రి చెప్పారు. "మా మొత్తం పాల సేకరణ 35 శాతానికి మించదు. అంటే, ఇప్పటికీ మనం ట్యాప్ చేయని గణనీయమైన భాగం ఉంది. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. సరఫరాను పెంచుతామని, వినియోగదారులు పాలు, పాల ఉత్పత్తులకు కొరత లేకుండా చూస్తామని" చెప్పారు. ఎలాంటి కొరత ఏర్పడే అవకాశం లేదనీ, దేశంలో తగినంత స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉందని, పాల గొలుసు సజావుగా పనిచేస్తోందని పురుషోత్తం రూపాలా తెలిపారు.

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?