సీబీఎస్ఈ పరీక్షలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. షెడ్యూల్ విడుదల

Siva Kodati |  
Published : Dec 31, 2020, 06:30 PM ISTUpdated : Dec 31, 2020, 06:33 PM IST
సీబీఎస్ఈ పరీక్షలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. షెడ్యూల్ విడుదల

సారాంశం

సీబీఎస్ఈ  పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది కేంద్రం. మే 4 నుంచి జూన్ 10 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. జూలై 15న ఫలితాలు రానున్నాయి. సాధారణంగా సీబీఎస్ఈ షెడ్యూల్ నవంబర్‌లోనే విడుదలవుతుంది.

సీబీఎస్ఈ  పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది కేంద్రం. మే 4 నుంచి జూన్ 10 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. జూలై 15న ఫలితాలు రానున్నాయి.

సాధారణంగా సీబీఎస్ఈ షెడ్యూల్ నవంబర్‌లోనే విడుదలవుతుంది. ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలు జరుగుతాయి. అయితే ఈసారి కరోనా కారణంగా పరీక్షలు కొంత ఆలస్యమవుతున్నాయి.

ఈ నెల 22న విద్యా శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ టీచర్లతో సమావేశమయ్యారు. సీబీఎస్ఈ పరీక్షలపై ఆరోజే క్లారిటీ ఇచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా మార్చి-ఏప్రిల్ మధ్యలో నిర్వహించే పరీక్షలు వాయిదా పడే అవకాశం లేదని కేంద్రమంత్రి తెలిపారు.

అయితే, సిలబస్ మాత్రం తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. 30 శాతం సిలబస్ తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?