సీబీఎస్ఈ 12 వ తరగతి బోర్డు ఫలితాల విడుదల: బాలికలదే పై చేయి

Published : Jul 22, 2022, 11:25 AM ISTUpdated : Jul 22, 2022, 11:39 AM IST
 సీబీఎస్ఈ 12 వ తరగతి బోర్డు ఫలితాల విడుదల: బాలికలదే పై చేయి

సారాంశం

సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు  ఫలితాలను శుక్రవారం నాడు  విడుదల  చేశారు. బాలుర కంటే బాలికలే ఈ పరీక్షల్లో ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ వరకు సీబీఎస్ఈ రెండో టర్మ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. 

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 92.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  పరీక్షా ఫలితాలను cbse.gov.in.cbseresults.nic.in ,parikshasangam.cbse.gov.in,results.cbse.nic.in వెబ్‌సైట్ లో చూడవచ్చని సీబీఎస్ఈ తెలిపింది.  ఈ పరీక్షల్లో బాలికలే కంటే బాలుర కంటే  అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 12వ తరగతిలో 92.71 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 94.54 శాతం బాలికలు, 91.25 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు.

 టర్మ్ 1, టర్మ్ 2 మార్కుల ఆధారంగా తుది మార్కుల జాబితాను సీబీఎస్ఈ సిద్దం చేసింది.  అంతర్గత మూల్యాంకనం, ప్రాజెక్ట్ వర్క్, ప్రాక్టికల్ పరీక్షలు, ప్రీ బోర్డు ఫలితాల ఆధారంగా విద్యార్ధులకు మార్కులను కేటాయించారు.సీబీఎస్ఈ 12వ తరగతి టర్మ్ 2 బోర్డు పరీక్షలను ఏప్రిల్ 26 నుండి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించారు.

సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలు సకాలంలోనే విడుదల చేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంతకు ముందే ప్రకటించారు. ఈ విషయమై తాను సీబీఎస్ఈ అధికారులతో మాట్లాడినట్టుగా వివరించారు. పరీక్షలు పూర్తైన తర్వాత 45 రోజుల తర్వాత పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. 

సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు  1,43,35,366 మంది పరీక్షలు రాశారు. పరీక్షలు రాసిన వారిలో 13,30,662 మంది ఉత్తీర్ణత సాధించారు. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో తిరువనంతపురం అత్యుత్తమ ఫలితాలను నమోదు చేసింది. ప్రయాగ్ రాజ్ లో మాత్రం పరీక్ష ఫలితాలు చెత్తగా ఉన్నాయని సీబీఎస్ఈ ప్రకటించింది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం