అఖిలేష్, ములాయంలకు ఊరట.. సీబీఐ క్లీన్ చిట్

By telugu teamFirst Published May 21, 2019, 12:09 PM IST
Highlights

అక్రమాస్తుల కేసులో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌లకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. 

అక్రమాస్తుల కేసులో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌లకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు సీబీఐ సుప్రీంకోర్టులో ఇవాళ తాజా అఫిడవిట్ దాఖలు చేసింది. అఖిలేశ్, ములాయంలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేనందున 2013 ఆగస్టులో ఈ కేసును మూసివేసినట్టు నివేదించింది.
 
‘‘ప్రాధమిక విచారణలో ఎలాంటి ఆధారాలు లభించనందున దీనిని ఎఫ్ఐఆర్ కిందికి మలచలేదు. కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు కూడా సీబీఐకి ఎప్పుడూ ఆదేశించలేదు...’’ అని సీబీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ కేసులో ములాయం, అఖిలేశ్‌పై ఆగస్టు 2013 తర్వాత ఎలాంటి దర్యాప్తు జరపలేదని సీబీఐ స్పష్టం చేసింది.

click me!
Last Updated May 21, 2019, 12:09 PM IST
click me!