Cash For Query Case: పార్ల‌మెంట్ స‌భ్య‌త్వం ర‌ద్దు.. మ‌హువా మొయిత్రా తొలి స్పంద‌న ఇదే..

By Mahesh Rajamoni  |  First Published Dec 8, 2023, 4:50 PM IST

Mahua Moitra Expulsion: డబ్బుల కోసం పార్ల‌మెంట్ లో ప్రశ్నలు అడిగిన ఆరోపణలపై టీఎంసీ నాయ‌కురాలు మ‌హువా మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేసిన నివేదికను బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న సమావేశమై ఆమోదించింది. తాజాగా ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించారు. 
 


Mahua Moitra-cash for query allegation: తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కురాలు, ఏంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు ప‌డింది. పార్ల‌మెంట్ లో ప్రశ్నించడానికి బదులుగా డబ్బు తీసుకున్నార‌నే ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ క్ర‌మంలోనే మహువా మొయిత్రా స్పందిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) స‌ర్కారుపై తీవ్ర‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇంత చేసినా మోడీ ప్రభుత్వం త‌న‌ను మౌనంగా ఉంచలేదని త‌న విమ‌ర్శ‌లు ప‌దును పెడుతూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎథిక్స్ కమిటీ నివేదికలో తన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేయడానికి కారణం లాగిన్ ఐడీని పంచుకోవడమేననీ, అయితే దీనిపై ఎలాంటి రూల్ లేదని టీఎంసీ నేత మహువా మొయిత్రా అన్నారు. 

తనను మాట్లాడ‌కుండా చేయ‌డం ద్వారా అదానీ గ్రూప్ ఇష్యూ నుంచి బయటపడవచ్చని మోడీ ప్రభుత్వం భావించిందని ఆరోపించారు. "అదానీ గ్రూప్ మీకు ఎంత ముఖ్యమో మీరు చూపించిన తొందరపాటు మొత్తం భారతదేశానికి ఈ కంగారూత‌నం చూపించిందని నేను మీకు చెబుతున్నాన‌ని" అన్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మొయిత్రా బహిష్కరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దాన్ని సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. 

Latest Videos

RBI Monetary Policy: క్రెడిట్ కార్డు, మ్యూచువల్ ఫండ్ చెల్లింపుల్లో కీల‌క మార్పులు.. ఆర్బీఐ సూచ‌న‌లు ఇవే

 

బీజేపీపై విమ‌ర్శ‌ల‌ దాడి..

'లాగిన్ పోర్టల్ ద్వారా నేను జాతీయ భద్రతకు ముప్పు కలిగించానా? బీజేపీ ఎంపీ రమేష్ బిధురి పార్లమెంట్ హౌస్ లో డానిష్ అలీని ఉద్దేశించి మతపరమైన పదాలు ఉపయోగించారు. 26 మంది ముస్లిం ఎంపీల్లో డానిష్ అలీ ఒకరు. కేవలం 26 మంది ఎంపీలు మాత్రమే కాదు ఈ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారు. బీజేపీకి 303 మంది ఎంపీలు ఉన్నారని, ఆ పార్టీ ఎంపీల్లో ఒక్కరు కూడా ముస్లింలు కాద'న్నారు. బహిష్కరించే అధికారం ఎథిక్స్ కమిటీకి లేదని మహువా అన్నారు. ఇది వారికి (బీజేపీ) అంతం ప్రారంభమ‌ని అన్నారు. కాగా,డబ్బుల కోసం పార్ల‌మెంట్ లో ప్రశ్నలు అడిగిన ఆరోపణలపై టీఎంసీ నాయ‌కురాలు మ‌హువా మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేసిన నివేదికను బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న సమావేశమై ఆమోదించింది.

UPI యూజర్లకు గుడ్ న్యూస్.. చెల్లింపుల‌పై ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం

 

click me!