ఐదేళ్ల చిన్నారిపై టీచర్ దాష్టీకం.. చెంపలు వాయించి, బెత్తంతో కొట్టి హింస.. కేసు నమోదు..

Published : Jan 31, 2023, 12:48 PM IST
ఐదేళ్ల చిన్నారిపై టీచర్ దాష్టీకం.. చెంపలు వాయించి, బెత్తంతో కొట్టి హింస.. కేసు నమోదు..

సారాంశం

ముంబై సమీపంలోని థానేలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిన్న జరిగిన ఈ ఘటనలో ఐదేళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా ప్రవర్తించాడు. చిన్నారిని చెంపదెబ్బలు కొట్టి, కర్రతో కొట్టి హింసించాడు. దీంతో ఆ ఐదేళ్ల చిన్నారి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఐదేళ్ల బాలుడిని కొట్టినందుకు 40 ఏళ్ల ఆ పాఠశాల ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. కళ్యాణ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సోమవారం జరిగిన ఈ ఘటనలో చిన్నారికి గాయాలైనట్లు మహాత్మ ఫూలే చౌక్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

చిన్నారిని కొట్టడానికి నిందితులను రెచ్చగొట్టింది ఏమిటనే దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు. బాలుడు ఈ సంఘటన గురించి అతని తల్లిదండ్రులకు తెలియజేయడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులుభారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్లు, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

మరో వీడియో రిలీజ్ చేసిన మోదీ ఏమన్నారంటే? | PM Narendra Modi Releases Another Video on Exam Reforms
ప‌రీక్ష‌ల వ్య‌వ‌స్థ‌లో కేంద్రం భారీ సంస్క‌ర‌ణ‌లు.. హైప‌వ‌ర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు