వాళ్ల చేతులు, తలలు నరికేయండి.. లైసెన్స్ లేకున్నా గన్ తీసుకోండి: వీహెచ్‌పీ ర్యాలీలో విద్వేషం

Published : Oct 09, 2022, 06:37 PM IST
వాళ్ల చేతులు, తలలు నరికేయండి.. లైసెన్స్ లేకున్నా గన్ తీసుకోండి: వీహెచ్‌పీ ర్యాలీలో విద్వేషం

సారాంశం

ఢిల్లీలో నిర్వహించిన వీహెచ్‌పీ ర్యాలీలో కొందరు వక్తలు విద్వేషాన్ని రగిల్చారు. చేతులు, తలలు నరికేయండి అంటూ రెచ్చగొట్టారు. లైసెన్స్ లేకున్నా గన్స్ తీసుకోండని తప్పుడు మార్గాలను సూచించారు.  

న్యూఢిల్లీ: దేశ రాజధాని వీహెచ్‌పీ తలపెట్టిన ర్యాలీ విద్వేషాన్ని చిమ్మింది. ఈ ర్యాలీలో ప్రసంగించిన కొందరు విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఎవరైనా దాడి చేయడానికి వస్తే.. వారి చేతులు నరికేయండి అని అన్నారు. వారి తలలు నరికేయండి అని పిలుపు ఇచ్చారు.

జగత్ గురు యోగేశ్వర్ ఆచార్య ప్రసంగం.. వీహెచ్‌పీ ర్యాలీని విద్వేషపూరితం చేసింది. ‘అవసరమైతే వారి చేతులు, తలలు నరికేయండి. మహా అయితే మీరు జైలుకు వెళతారు. కానీ, ఈ శక్తులకు బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది. ఇలాంటి వారిని వెతికి వెతికి దాడి చేయండి’ అని అన్నారు.

మరో వక్త మహంత్ నవల్ కిశోర్ దాస్ మాట్లాడుతూ ఇదే ధోరణి ఫాలో అయ్యారు. ‘గన్‌లు తీసుకోండి. లైసెన్స్‌లు తీసుకోండి. మీరు లైసెన్స్ పొందకున్నా సరే.. బాధపడకండి. మిమ్మల్ని చంపడానికి వస్తున్నవారి దగ్గర ఏమైనా లైసెన్స్‌లు ఉన్నాయా? మరి మీకు ఎందుకు లైసెన్స్?’ అంటూ మైక్‌లో గట్టిగా అరిచారు.

‘మనమంతా ఒక దగ్గరికి చేరితే ఢిల్లీ పోలీసు కమిషనర్ కూడా మనకు టీ ఆఫర్ చేస్తారు. మనం ఏం చేయాలని అనుకుంటున్నామో అది చేయనిస్తారు’ అని అధికార దుర్వినియోగం గురించి మితిమీరి మాట్లాడారు.

కాగా, ఈ వ్యాఖ్యలను వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సల్ సమర్థించుకువచ్చారు. ఇది జన్ ఆక్రోశ్ ర్యాలీ అని అన్నారు. ఈ సందేశాలు ఏ వర్గాన్నీ ఉద్దేశించి కాదని, జిహాదీ శక్తులను ఉద్దేశించే అని తెలిపారు. ప్రజలు అంతా ఆగ్రహంతో ఉన్నారు. వక్తులు చెప్పేదంతా కూడా జిహాదీ శక్తుల నుంచి స్వీయ రక్షణ కోసం అవసరమైతే చేయాల్సినవని వివరించారు. 

ఢిల్లీలో 25 ఏళ్ల వ్యక్తి హత్య నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యక్తిని ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారు హత్య చేశారు. ఈ హత్యలో మత పరమైన కోణమేమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఏడాది క్రితం మనీష్ మొబైల్ ఫోన్‌ను కొందరు లాక్కెళ్లారు. ఆ ఇద్దరిపై కేసు పెట్టారు మనీష్. ఆ కేసు వాపసు తీసుకోవాలని మనీష్ పై వారు ఒత్తిడి పెంచారు. కానీ, అందుకు ఆయన తిరస్కరించడంతో మనీష్‌ను హతమార్చారు. మొబైల్ లాక్కెళ్లినవారి స్నేహితులే హంతకులు అని పోలీసులు అనుమానిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్