భర్తను చంపినా భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందే.. హైకోర్టు సంచలన తీర్పు..

Published : Feb 01, 2021, 10:15 AM IST
భర్తను చంపినా భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందే.. హైకోర్టు సంచలన తీర్పు..

సారాంశం

ఫ్యామిలీ పెన్షన్ విషయంలో దాఖలైన కేసులో పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.  పెన్షన్ అనేది సంక్షేమ పథకం అని, ప్రభుత్వ ఉద్యోగి భార్యకున్న ఫ్యామిలీ పింఛను హక్కు కాదనలేనిది. ఒకవేళ ఆమె తన భర్తను చంపినా సరే.. భర్త మరణానంతరం పునర్వివాహం చేసుకున్నా సరే.. అంటూ పంజాబ్, హరియాణా హై కోర్టు ఇటీవల ఓ కేసులో అసాధారణ తీర్పు చెప్పింది. అంతేకాదు ‘బంగారుగుడ్లు పెట్టే కోడిని ఎవరూ కిరాతకంగా చంపుకోరు’ అంటూ ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 

‘ఫ్యామిలీ పెన్షన్ అనేది సంక్షేమ పథకం. ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు దాన్ని ప్రవేశపెట్టారు. క్రిమినల్ కేసులో ఆమెకు జైలు శిక్ష పడ్డా ఈ పథకం కింద భార్యకున్న హక్కును కాదనలేం అంటూ హరియాణాలోని అంబాలాకు చెందిన బల్జీత్ కౌర్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జనవరి 25న హైకోర్టు  వ్యాఖ్యానించింది. 

హరియాణా ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమె భర్త తర్సెమ్ సింగ్ 2008లో చనిపోయారు. 2009లో ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. 2011లో శిక్ష పడింది. అప్పటి దాక బల్జీత్ కౌర్ కు అందుతున్న ఫ్యామిలీ పెన్షన్ ను శిక్ష పడగానే హరియాణా ప్రభుత్వం ఆపేసింది.

దీంతో ఆమె హై కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఉత్తర్వులను పక్కనపెడుతూ బల్జీత్ కౌర్ కు రావాల్సిన కుటుంబ పింఛను, పాత బకాయిలు రెండు నెలల్లో విడుదల చేయాలని హై కోర్టు సంబంధిత శాఖను ఆదేశించింది. భర్త మరణానంతరం  ఫ్యామిలీ పెన్షన్ హక్కుదారు భార్యేనంటూ 1972 సీసీఎస్ (పింఛను) నిబంధనల మేరక హై కోర్టు ఈ తీర్పును వెలువరించింది. 
 
PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu