దేశవ్యాప్తంగా బిజెపి ప్రభంజనం : జార్ఖండ్, వయనాడ్ లో కాంగ్రెస్ కు ఊరట

By Arun Kumar P  |  First Published Nov 23, 2024, 6:23 PM IST

మహారాష్ట్ర, జార్ఖండ్ తో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బిజెపి ప్రభంజనం కొనసాగింది. వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు కూడాా మంచి పలితాలు వచ్చాయి.  


దేశవ్యాప్తంగా జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాల ప్రభంజనం కొనసాగింది. మహారాష్ట్రలో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి 288 స్థానాలకు గాను 230కి పైగా సీట్లు సాధించింది. జార్ఖండ్ లో మాత్రం ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులై కాంగ్రెస్, జెఎంఎం కూటమి విజయం సాధించింది. ఇక్కడ బిజెపికి ఓటమి తప్పలేదు. 

ఇక 14 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా పూర్తయింది. పలితాల్లో వివిధ పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ప్రారంభంలో ఎన్నికల సంఘం 48 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రకటించగా రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

Latest Videos

undefined

తాజాగా వెెలువడిన ఎన్నికల ఫలితాల్లో ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానంలో చరిత్రాత్మక విజయం సాధించారు. ఆమె ఏకంగా 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ క్రమంలో వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ... ప్రజల నమ్మకానికి, స్నేహానికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

వివిధ రాష్ట్రాల ఉప ఎన్నికల పూర్తి ఫలితాలు జాబితా ఇక్కడ ఉంది:

అస్సాం ఉప ఎన్నికల ఫలితాలు 2024:

ధోలై - నిహార్ రంజన్ దాస్ (BJP)

సిడ్లి- నిర్మల్ కుమార్ బ్రహ్మ (UPPL)

బోన్‌గైగావ్- దీప్తిమయి చౌదరి (AGP)

బెహల్- దిగంత ఘటోవాల్ (BJP)

సమగురి - దిప్లు రంజన్ శర్మ (BJP)

బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు 2024:

తరారి- విశాల్ ప్రశాంత్ (BJP)

రామ్‌గఢ్- అశోక్ కుమార్ సింగ్ (BJP)

ఇమాంగంజ్- దీప కుమారి (HAM(S))

బెల్‌గంజ్- మనోరమ దేవి (JD(U))

ఛత్తీస్‌గఢ్ ఉప ఎన్నికల ఫలితాలు 2024:

రాయ్‌పూర్ సిటీ సౌత్ - సునీల్ కుమార్ సోని (BJP)

గుజరాత్ ఉప ఎన్నికల ఫలితాలు 2024:

వావ్ - ఠాకూర్ స్వరూప్‌జీ సర్దార్‌జీ (BJP)

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు 2024

శిగ్గావ్ - యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ (INC)

సండూర్- E అన్నపూర్ణ (INC)

చన్నపట్న- C P యోగేశ్వర (INC)

కేరళ ఉప ఎన్నికల ఫలితాలు 2024

పాలక్కాడ్- రాహుల్ మంకూటతైల్ (INC)

చెలక్కర- UR ప్రదీప్ (CPIM)

కేరళ పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలు 2024

వయనాడ్- ప్రియాంక గాంధీ (INC)

 మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు 2024

విజయపూర్- ముఖేష్ మల్హోత్రా (INC)

బుధ్ని - రమాకాంత్ భార్గవ (బిజెపి)

మేఘాలయ ఉప ఎన్నికల ఫలితాలు 2024:

గంబెగ్రే- మెహతాబ్ చండీ అగిటోక్ సంగ్మా (NPP)

మహారాష్ట్ర పార్లమెంటరీ నియోజకవర్గ ఉపఎన్నికల ఫలితాలు 2024:

నాందేడ్ - డాక్టర్ సంతుక్రావ్ మరోత్రావ్ హంబర్డే (బిజెపి)

పంజాబ్ ఉప ఎన్నికల ఫలితాలు 2024:

గిద్దర్‌బాహా- హర్దీప్ సింగ్ డింపీ ధిల్లాన్ (AAP)

డేరా బాబా నానక్- గురుదీప్ సింగ్ రంధవా (AAP)

చబ్బెవాల్ (SC)- డాక్టర్ ఇషాంక్ కుమార్ (AAP)

బర్నాలా- కుల్దీప్ సింగ్ ధిల్లాన్ కాలా ధిల్లాన్ (INC)

రాజస్థాన్ ఉపఎన్నికల ఫలితాలు 2024:

ఝుంఝును- రాజేంద్ర భంబూ (బిజెపి)

రామ్‌గఢ్- సుఖవంత్ సింగ్ (బీజేపీ)

దౌసా-దీన్ దయాళ్ (బీజేపీ) డియోలి-

ఉనియారా- రాజేంద్ర గుర్జార్ (బిజెపి)

ఖిన్వసర్ - రేవంత్ రామ్ దంగా (బిజెపి)

సాలంబర్- శాంత అమృత్ లాల్ మీనా (బిజెపి)

చోరాసి- అనిల్ కుమార్ కటారా (BAP)

సిక్కిం ఉపఎన్నికల ఫలితాలు 2024:

సోరెంగ్-చఖుంగ్ - ఆదిత్య గోలే (తమంగ్) (SKM)

నామ్చి-సింగితాంగ్ - సతీష్ చంద్ర రాయ్ (SKM)

ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలు 2024:

కాటేహరి- ధర్మరాజ్ నిషాద్ (బిజెపి)

కర్హల్- తేజ్ ప్రతాప్ సింగ్ (SP)

కుందర్కి- రాంవీర్ సింగ్ (బీజేపీ)

మీరాపూర్- మిథ్లేష్ పాల్ (RLD)

ఘజియాబాద్ - సంజీవ్ శర్మ (బిజెపి)

మజవాన్- సుచిస్మిత మౌర్య (బీజేపీ)

సిషామౌ- నసీమ్ సోలంకి (SP)

ఖైర్ - సురేందర్ దిలేర్ (బిజెపి)

ఫుల్పూర్ - దీపక్ పటేల్ (బిజెపి)

ఉత్తరాఖండ్ ఉప ఎన్నికల ఫలితాలు 2024

కేదార్‌నాథ్ - ఆశా నౌటియాల్ (బిజెపి)

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల ఫలితాలు 2024

సీతై- సంగీతా రాయ్ (AITC)

మదారిహత్ - జయప్రకాష్ టోప్పో (AITC)

నైహతి- సనత్ డే (AITC)

హరోవా- SK రబీయుల్ ఇస్లాం (AITC)

మేదినీపూర్- సుజోయ్ హజ్రా (AITC)

తల్దంగ్రా- ఫల్గుణి సింహబాబు (AITC)

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024 : 

మహాయుతి (బిజెపి, ఎన్సిపి (అజిత్ పవార్), శివసేన (షిండే)) కూటమి - 231

మహా వికాస్ అఘాడీ (కాంగ్రెస్, ఎన్సిపి (శరద్ పవార్), శివసేన (ఉద్దవ్ థాక్రే)) ‌- 52

ఇతరులు - 4

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 : 

ఇండియా కూటమి (జెఎంఎం, కాంగ్రెస్, ఇతర పార్టీలు) - 56

ఎన్డిఏ కూటమి (బిజెపి, ఇతర పార్టీలు) - 24

ఇతరులు - 1

click me!