రూ. 600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన డాక్టర్ అరవింద్ గోయల్

Published : Jul 21, 2022, 04:11 PM IST
రూ. 600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన డాక్టర్ అరవింద్ గోయల్

సారాంశం

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఔదార్యం చాటుకున్నారు. రాష్ట్రంలోని మొరాదాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త,  పారిశ్రామికవేత్త డాక్టర్ అరవింద్ గోయల్.. పేదలకు సహాయం చేయడానికి తన ఆస్తి మొత్తాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఔదార్యం చాటుకున్నారు. రాష్ట్రంలోని మొరాదాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త,  పారిశ్రామికవేత్త డాక్టర్ అరవింద్ గోయల్.. పేదలకు సహాయం చేయడానికి తన ఆస్తి మొత్తాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. అతని మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ.600 కోట్లకు చేరువలో ఉందని తెలుస్తోంది. తాజాగా అరవింద్ గోయల్ తన ఆస్తిని దానం చేశారు. అయితే  దాదాపు 25 ఏళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అరవింద్ గోయల్ తెలిపారు.

డాక్టర్ అరవింద్ గత 50 ఏళ్లలో తన కష్టపడి ఈ ఆస్తిని సంపాదించారు. ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాల్లో ఉన్న పలు ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వృద్ధాశ్రమాలకు ట్రస్టీగా ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలో మొరాదాబాద్‌లోని 50 గ్రామాలను దత్తత తీసుకుని అరవింద్ కుమార్ గోయల్ ప్రజలకు నిత్యవసరమైన ఉచిత సౌకర్యాలు కల్పించారు. పులవురు పేదలకు ఉచిత విద్య, మెరుగైన వైద్యం కూడా ఆయన ఏర్పాటు చేశారు. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ,  ప్రతిభా పాటిల్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంలు అరవింద్ గోయల్‌ను సత్కరించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా గోయల్‌ను సత్కరించారు.

ఇక, అరవింద్‌కు భార్య రేణు గోయల్‌తో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అరవింద్ ఆస్తి మొత్తం విలువను లెక్కించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో 2 మంది సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేయగా, 3 మంది సభ్యులను గోయల్ స్వయంగా నామినేట్ చేస్తారు. వారు ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చిన ఆ డబ్బును అనాథలు,  నిరుపేదలకు ఉచిత విద్య మరియు చికిత్స కోసం ఉపయోగిస్తారు.

ఇక, అరవింద్ గోయల్ పారిశ్రామికవేత్తగా కూడా. మొత్తం ఆస్తిని దానం చేసిన.. ఒక్క ఇంటిని మాత్రమే తన దగ్గర ఉంచుకున్నారు. అరవింద్ గోయల్ ఆస్తి దానం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని.. అతని కుటుంబంలోని పిల్లలు, భార్య హృదయపూర్వకంగా స్వాగతించారు.

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?