
జైపూర్:Rajasthan రాష్ట్రంలోని అనాసాగర్ సరస్సులో కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. ఈ నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లా Anasagar సరస్సులో రెండు వేల రూపాయాల Currency కట్టలు తేలియాడుతూ కన్పించాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. Lake లో నీటిపై తేలియాడుతున్న నోట్ల కట్టలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కరెన్సీ కట్టలు తడిసిపోయాయి.
వీటిని ఇంకా లెక్కించాల్సి ఉందని అనాసాగర్ ఎస్పీ బల్‌దేవ్ సింగ్ చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు కరెన్సీ కట్టలను ఈ సరస్సులో వదిలివేశారని రాజస్థాన్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సరస్సు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులు నీటిలో కరెన్సీ కట్టలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ కరెన్సీ నకిలీదని కూడా ప్రచారం సాగుతుంది. ఈ కరెన్సీ అసలుదో ,నకిలీదో ఇంకా తేలాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. ఈ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్ర కూడా ఉందని స్థానికులు గుర్తు చేస్తున్నారు.
గత ఏడాది జూన్ లో Ajmer లోని అనాసాగర్ సరస్సు రాంప్రసాద్ ఘాట్ లో రూ. 200, రూ. 500 నోట్లతో నిండిన బ్యాంగ్ కన్పించింది. ఈ కరెన్సీ కోసం చాలా మంది సరస్సులోకి దిగి డబ్బును తీసుకొన్నారు.