లక్నోలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. శిథిలాల కింద 60 మంది..?

Siva Kodati |  
Published : Jan 24, 2023, 07:57 PM IST
లక్నోలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. శిథిలాల కింద 60 మంది..?

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో  ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం జరిగింది. ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద పదుల సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. గత కొన్నిరోజులుగా ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పాత భవనం ఏమైనా బలహీనమైందా అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు