ప్రేమించుకున్న అన్నాచెల్లెలు...పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య

Published : Mar 06, 2019, 10:03 AM IST
ప్రేమించుకున్న అన్నాచెల్లెలు...పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య

సారాంశం

వారిద్దరు వరసకు అన్నాచెల్లెలు. అయితే దూరపు చుట్టరికం కావడంతో ఈ వరస గురించి తెలియకపోవడంతో వారిద్దరు ప్రేమించేకున్నారు. అయితే  కుటుంబ పెద్దలు మీరిద్దరు అన్నాచెల్లెలి వరస అవుతారని చెప్పి వారి ప్రేమను అంగీకరించకుండా పెళ్లి చేయడానికి నిరాకరించారు. అప్పటికే ప్రాణానికి  ప్రాణంగా ప్రేమించుకున్న ఈ జంట ఎలాగూ కలిసి బ్రతకలేము...కలిసైనా చద్దామని భావించారో ఏమోగానీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన ఒడిషా రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్‌ జిల్లాలోని ఖెమరా గ్రామానికి చెందిన జాని(21), కుమారి జాని(20)  బంధువులు. వీరిద్దరు వరసకు అన్నాచెల్లెలు అవుతారు. అయితే దూరపు చుట్టాలు కావడంతో ఆ వరసల గురించి తెలియకపోవడంతో వీరిద్దరి మనసులు ఒక్కటయ్యాయి. ఒకరంటే మరొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. 

ఇలా ప్రేమలో మునిగితేలిన వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. దీంతో తమ ప్రేమ వ్యవహారం గురించి కుటుంబ పెద్దలకు తెలిపారు.  అయితే వీరిద్దరి వరస కారణంగా పెళ్లికి నిరాకరించారు. 

దీంతో ఈ ప్రేమజంట దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి ఊరి చివరన వున్న ఓ చెట్టుకు ఉరెసుకుని ప్రాణాలు వదిలారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ఈ ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా  స్థలాన్ని పరిశీలించారు.  గ్రామస్ధుల సాయంతో మృతదేహాలను కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

Richest MLAs in India | టాప్ 10 ధనిక ఎమ్మెల్యేలు వీరే..నలుగురు తెలుగువారే! | Asianet News Telugu
Bhajan Clubbing : మోదీ మెచ్చిన భజన్ క్లబ్బింగ్.. ఇందులో అంత కిక్ ఏముంది? అసలు ఏంటిది?