పెళ్లి మండపంలో వధువుపై కాల్పులు

Published : Jan 18, 2019, 02:23 PM IST
పెళ్లి మండపంలో వధువుపై కాల్పులు

సారాంశం

పెళ్లి మండపంలో.. పీటలపై కూర్చున్న వధువుపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.

పెళ్లి మండపంలో.. పీటలపై కూర్చున్న వధువుపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.ఈ విషాదకర సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని షాకార్ పూర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  ఢిల్లీకి చెందిన పూజ(19)కి వివాహం నిశ్చయమైంది. కుటుంబసభ్యులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేసారు.

గురువారం పెళ్లి జరుగుతండగా.. వధూవరులు ఇద్దరూ వేదికపై ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అంగతకుడు.. తుపాకీతో వధువుని కాల్చి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఒక్కసారిగా ఇలా కాల్పులు జరగడంతో.. పెళ్లికి వచ్చినవారంతా అవాక్కయ్యారు. 

వధువు పూజను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె కాలికి గాయమైంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యలు తెలిపారు. అయితే.. ఆమెపై ఎవరు కాల్పులు జరిపారు అనే విషయం మాత్రం తెలియరాలేదు. పరారీలో ఉన్న దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, అతడు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపాడా? లేదా మరే ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

World Coldest Place : ఫ్రిజ్‌లో ఉన్నట్టే.. ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ ప్లేస్ ఇదే గురూ !
పేదరిక నిర్మూలనకు సరికొత్త ఫార్ములా.. ఇక గ్రామాల బాధ్యత విద్యార్థులదే