భర్త ఇంట్లో టాయిలెట్ లేదని ఆత్మహత్య చేసుకున్న నవవధువు

Published : May 10, 2022, 02:15 PM ISTUpdated : May 10, 2022, 02:33 PM IST
భర్త ఇంట్లో టాయిలెట్ లేదని ఆత్మహత్య చేసుకున్న నవవధువు

సారాంశం

పుట్టినింటి నుంచి మెట్టినింట అడుగుపెట్టిన ఓ నవ వధువు అక్కడి ఇంటిలో టాయిలెట్ లేదని తెలుసుకుని తీవ్ర మనస్థాపం చెందింది. తన భర్తతో తరచూ ఈ విషయాన్ని చర్చించింది. టాయిలెట్ ఉన్న ఇంటిని వెతికి అందులోకి మారాలని వాదించింది. టాయిలెట్ లేని కారణంగా ఆ నవ వధువు తల్లి వద్దకే చేరింది. చివరకు ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులో ఈ ఘటన చోటుచేసుకుంది.  

చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి నెల నిండిందో లేదో ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. కారణం తెలిస్తే షాక్ అవుతారు. అత్తా గారింట్లో టాయిలెట్ లేదనే కారణంతో ఆ నవ వధువు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని కడలోర్‌లో చోటుచేసుకుంది.  

కడలోర్ జిల్లా అరిసిపెరియంకుప్పమ్ గ్రామానికి చెందిన రమ్య ఓ ప్రైవేటు హాస్పిటల్ పని చేసేది. ఆ 27 ఏళ్ల యువతి ఏప్రిల్ 6వ తేదీన కార్తికేయన్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. కార్తికేయన్ ఇంటిలో వినియోగంలో ఉండే టాయిలెట్ లేదు. దీంతో పెళ్లి చేసుకుని మెట్టినింట అడుగుపెట్టిన రమ్య కలత చెందింది. టాయిలెట్ లేకపోవడంపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తన భర్తతో ఈ విషయంపై మాట్లాడింది. 

భర్త నివాసంలో టాయిలెట్ లేకపోవడంతో ఆమె పెళ్లి అయిన తర్వాత తన తల్లితో ఉన్నట్టు సమాచారం. 

పెళ్లి అయిన తర్వాత ఇంట్లో టాయిలెట్ లేదని తెలిసిన తర్వాత రమ్య.. కార్తికేయన్‌తో ఈ విషయమై వాదించుకున్నారు. తగువులు కూడా జరిగాయి. కడలోర్ నగరంలో టాయిలెట్ ఉన్న ఓ ఇంటిని వెతికి అందులోకి మారాల్సిందిగా ఆమె కార్తికేయన్‌కు సూచించింది. టాయిలెట్ విషయమై తరుచూ వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇదిలా ఉండగా, సోమవారం రమ్య తల్లి బయటకు వెళ్లింది. మళ్లీ ఇంటికి రాగానే ఇంటిలో సీలింగ్ ఫ్యాన్‌కు కట్టిన ఉరితాడుకు రమ్య వేలాడుతూ కనిపించింది. ఆ తల్లి ఖంగుతిన్నది. వెంటనే ఆమెను కడలోర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించినట్టు పోలీసులు వివరించారు. ఆ తర్వాత రమ్యను పాండిచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (జిప్‌మర్)కు తరలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి రమ్య మరణించింది.

రమ్య తల్లి మంజుల తిరుపతిరుపులియుర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో (Maharashtra)  దారుణం జరిగింది. ఏకంగా రైలు వాష్‌రూమ్‌లోనే (train wash room) యువతి ఆత్మహత్యకు (suicide) పాల్పడింది. స్వరాజ్‌ ఎక్స్‌ప్రెస్‌లో (Swaraj Express) ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాంద్రా (Bandra ) నుంచి జమ్ముతావికి (Jammu Tawi) ఆదివారం బయలుదేరిన స్వరాజ్ ఎక్స్‌ప్రెస్‌లో 20 ఏళ్ల యువతి ఎక్కింది. ఆ తర్వాత రైలు తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన కొద్ది సేపటి తర్వాత సదరు యువతి వాష్‌‌రూమ్‌కని వెళ్లింది. అయితే ఎంతసేపటికీ యువతి సీట్లో వచ్చి కూర్చోలేదు.

దీంతో అనుమానం వచ్చిన తోటి ప్రయాణీకులు వాష్‌ రూమ్‌ తలుపులు బద్దలుగొట్టిచూడగా.. యువతి మృతదేహం కనిపించింది. అనంతరం దీనిపై రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. యువతి వాష్‌ రూమ్‌కి వెళ్లి చాలా సేపటి వరకు సీట్లోకి రాలేదని, ఎస్‌ 4 కోచ్‌లోని తోటి ప్రయాణికులు తెలిపారు. వాష్‌‌రూమ్‌ వద్ద యువతిని పిలిచినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఆ తర్వాత టీసీ కొందరు ప్రయాణికులతో కలిసి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే లోపలి నుంచి గడియవేసి ఉండటంతో దానిని తెరువలేకపోయారు. దీంతో రైలును దహను రోడ్‌ రైల్వేస్టేషన్‌ (Dahanu Road railway station) వద్ద నిలిపివేశారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం