మరికాసేపట్లో పెళ్లి.. ఊరేగింపులో వరుడు.. వధువు మిస్సింగ్..

By telugu news teamFirst Published Dec 14, 2020, 10:40 AM IST
Highlights

రాత్రంతా వారు వధువు ఇంటికోసం ఎంత వెదికినా ప్రయోజనం లేకపోయింది. అదేవిధంగా వధువు గురించి అక్కడివారిని ఎవరిని అడిగినా తమకు తెలియదని చెప్పారు. 
 

మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉంది. వరుడు, అతని తరుపు బంధువులు చాలా ఆనందంగా పెళ్లికి ఊరేగింపుగా వచ్చారు. అయితే.. అనూహ్యంగా.. పెళ్లి మండపంలోకి అడుగుపెట్టాల్సిన వధువు మాత్రం కనిపించకుండా పోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగఢ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆజంగఢ్ కు చెందిన ఓ యువకుడికి డిసెంబర్ 10న మవూ జిల్లాకు చెందిన యువతితో వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో పెళ్లి కొడుకు తన బంధువులతో కలిసి పెళ్లికి ఊరేగింపుగా బయలు దేరాడు. అయితే సడెన్ గా పెళ్లి కూతురు మాత్రం కనిపించలేదు.

రాత్రంతా వారు వధువు ఇంటికోసం ఎంత వెదికినా ప్రయోజనం లేకపోయింది. అదేవిధంగా వధువు గురించి అక్కడివారిని ఎవరిని అడిగినా తమకు తెలియదని చెప్పారు. 

దీంతోవారు పెళ్లి వేడుక జరగకుండానే ఇంటికి తిరిగి రావాల్సివచ్చింది. తరువాత మగపెళ్ళివారు ఈ వివాహాన్ని కుదిర్చిన మహిళపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ, ఆమెను బంధించారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో సీస్ పోలీస్ స్టేషన్‌కు మారింది. అక్కడ ఆ మహిళ తనను ఆడపెళ్లివారు మోసం చేశారని వాపోయింది. 

ఈ ఉదంతం గురించి సీనియర్ ఎస్‌ఐ రామేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ మగపెళ్లివారు ఈ సంబంధం కుదిర్చిన మహిళపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని, తాము ఇరువర్గాల వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశామన్నారు. దీంతో మగపెళ్లివారు ఆమెపై ఎటువంటి ఎఫ్ఐఆర్ రాయలేదన్నారు. వివరాల్లోకి వెళితే వరుని తరుపువారు పెళ్లి సంబంధాల కోసం ఆ మహిళను సంప్రదించారు. ఆమె మవూకు చెందిన యువతితో వివాహం కుదిర్చింది. అయితే వరుని తరపువారు వధువు ఇంటికి వెళ్లకుండానే, వివాహ ముహూర్తం నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని ఆ మహిళకు తెలిపారు. ఇంతలోనే ఆడపెళ్లివారు ఈ వివాహం వద్దనుకుని, ఊరి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. 
  
 

click me!