నగ్నంగా ఫోటోలు.. నవ వధువు ఆత్మహత్య

Published : Jun 06, 2020, 09:13 AM ISTUpdated : Jun 06, 2020, 09:16 AM IST
నగ్నంగా ఫోటోలు.. నవ వధువు ఆత్మహత్య

సారాంశం

ఆ మహిళకు చెందిన ఫొటోలు అజయ్‌ మొబైల్‌లో ఉండటం, ఇద్దరూ నగ్నంగా ఉన్న ఫొటోలు కనిపించడంతో భావన అజయ్‌ను నిలదీసింది. ఈ విషయం రెండు కుటుంబాల పెద్దల వరకు వెళ్లింది.

ఆమెకు పెళ్లి అయ్యి.. నెల రోజులు కూడా కాలేదు. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమె ఆశలన్నీ నిరాశలయ్యాయి. తాను ఎంతో ఇష్టపడి పెళ్లిచేసుకున్న వ్యక్తికి  మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే విషయం తెలిసి అతని గుండె పగిలిపోయింది. తట్టుకోలేక ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది.

మైసూర్ లోని  ఆనంద నగరకు చెందిన భావన (24) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భావనకు నెల క్రితం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అజయ్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు నుంచే అజయ్‌ మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు. 

ఆ మహిళకు చెందిన ఫొటోలు అజయ్‌ మొబైల్‌లో ఉండటం, ఇద్దరూ నగ్నంగా ఉన్న ఫొటోలు కనిపించడంతో భావన అజయ్‌ను నిలదీసింది. ఈ విషయం రెండు కుటుంబాల పెద్దల వరకు వెళ్లింది. అనంతరం పెద్దలు ఇద్దరికి రాజీ కూడా చేశారు. అయినా కూడా భర్తలో మార్పు రాలేదు. దీంతో తీవ్ర ఆవేదనతో శుక్రవారం ఉదయం భావన తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు