వరుడితో రెండు అడుగులు వేశాక పెళ్లి వద్దన్న వధువు.. ‘పెళ్లి కొడుకు అతనిలా లేడు’

Published : Jul 10, 2022, 07:16 PM IST
వరుడితో రెండు అడుగులు వేశాక పెళ్లి వద్దన్న వధువు.. ‘పెళ్లి కొడుకు అతనిలా లేడు’

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుక ఊహించని కారణంతో రద్దు అయింది. పెళ్లి తంతు మొదలయ్యాక.. వరుడి వెంట ఏడు అడుగులు వేయడానికి లేచిన ఆ వధువు ఉన్నట్టుండి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి పెళ్లి మంటపం నుంచి వెళ్లిపోయింది. అందుకు ఆమె చెప్పిన కారణాలు విని అందరూ షాకయ్యారు.  

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి పీటలపై వివాహాన్ని వధువు రద్దు చేసింది. ఆహ్వానితులు సహా కుటుంబ సభ్యులూ ఆమె చర్యకు ఖంగు తిన్నారు. పెళ్లి వద్దనడానికి గల కారణం విని వారు మరింత షాక్‌కు గురయ్యారు. పెళ్లి వేడుక ప్రారంభం అయ్యాక.. ఇరువురూ వర మాలలు వేసుకున్నా.. అతని వెంట వేయాల్సి ఏడు అడుగుల్లో రెండు అడుగులు వేశాక ఆమె ఈ నిర్ణయం ప్రకటించింది. ఉన్నట్టుండి పెళ్లి మంటపం నుంచి లేచి వెళ్లిపోయింది. వరుడు నల్లగా ఉన్నాడని ఆమె చెప్పింది. అంతేకాదు.. తనకు చూపించిన వ్యక్తిలా ఇతను లేడని పేర్కొంటూ వెళ్లిపోవడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎటవాలో చోటుచేసుకుంది.

నీతు యాదవ్, రవిలు పెళ్లి పీటల పైకి ఎక్కారు. వర మాలలు వేసుకున్నారు. ఇక్కడి నుంచే ఆమెలో అసంతృప్తి మొదలైంది. అప్పటి నుంచి పెళ్లి పీటలపై ఆమె ఇబ్బందికరంగానే మెదులుతున్నట్టు కనిపించింది. ఆయనతో లేచి అగ్నిగుండం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయడానికి లేచారు. రెండు రౌండ్లు ఆయన చిటికెన వేలు పట్టుకుని వెంటే నడిచారు. ఆ తర్వాత వెంటనే ఆమె హఠాత్తుగా ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది.

రెండు రౌండ్లు వరుడి వెంటే నడిచిన వధువు నీతు యాదవ్ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ప్రకటించింది. వరుడు నల్లగా ఉన్నాడని తెలిపింది. అలాగే, తనకు చూపించిన వ్యక్తి.. తనను పెళ్లి చేసుకుంటున్న వ్యక్తి వేర్వేరు అని ఆరోపించింది. తనకు చూపించిన వ్యక్తిలా పెళ్లి కొడుక లేడని తెలిపింది. అనంతరం ఆమె పెళ్లి మండపం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె వెంటనే తిరిగి రావాలని పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు ఎంతో బ్రతిమాలారు. కానీ, ఆమె వెనక్కి తిరిగి చూడలేదు.

సుమారు ఆరు గంటల పాటు ఆమె కోసం వారు ఎదురు చూశారు. ఆ తర్వాత పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఆ పెళ్లి ఇక జరగదని వెళ్లిపోయారు. ఇప్పుడు వరుడి తండ్రి పోలీసు కేసు పెట్టారు. వధువు కోసం వేల రూపాయలు పెట్టి నగలు చేపించామని, అవి తమకు తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. తన భవిష్యత్ గందరగోళంలో పడిందని వరుడు బోరుమన్నాడు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?