వధువు పెట్టిన చదువు పరీక్షలో వరుడు ఫెయిల్: పీటల మీదే పెళ్లి పెటాకులు

By telugu teamFirst Published May 9, 2021, 9:21 AM IST
Highlights

వధువు పెట్టిన చదువు పరీక్షలో వరుడు ఫెయిల్ అయ్యాడు. దీంతో వధువు పెళ్లి వద్దంటూ పెళ్లి పీటల మీది నుంచి లేచిపోయింది. దీంతో పెళ్లి రద్దయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

లక్నో:  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తాను పెట్టిన పరీక్షలో వరుడు ఫెయిల్ కావడంతో వధువు వివాహాన్ని రద్దు చేసుకుంది. టేబుల్ 2 చదవడంలో అతను విఫలమయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్ాల ధావర్ గ్రామంలో చోటు చేసుకుంది. 

బారాత్ తో వధువు పెళ్లి మండపానికి వచ్చింది. అయితే, పెళ్లి మాత్రం జరగలేదు. వరుడి విద్యార్హతలపై వధువుకు అనుమానం వచ్చింది. దాంతో అతనికి అతి మామూలు పరీక్ష పెట్టింది. టేబుల్ 2 చదవాల్సిందిగా చెప్పింది. అయితే అతను దాన్ని పఠించలేకపోయాడు. దాంతో వధువు పెళ్లిని రద్దు చేసుకుంది.

వివాహం జరిగే చోటు బంధువులు, కుటుంబ సభ్యులతో నిండి ఉంది. దండలు మార్చుకోవడానికి ముందు వరుడికి చదువు పరీక్ష పెట్టింది. అతను విఫలం కావడంతో అతి మామూలుగా పెళ్లి మండపం దిగిపోయింది. వరుడు ఏ విధమైన విద్యను అభ్యసించలేదని తెలిసి వధువు కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. అతను బడి ముఖం కూడా చూడలేదని తెలిసింది. 

వరుడి కుటుంబం తమను మోసం చేసిందని భావించారు. మచ్చ పడుతుందని భయపడకుండా తన సోదరి ధైర్యం చేసిందని ఆమె సోదరుడు అన్నారు. ఇరు కుటుంబాలవాళ్లు కూడా ఆ తర్వాత రాజీకి వచ్చి వివాహాన్ని రద్దు చేసుకున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాలు రాజీకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. బహుమతులు, ఆభరణాలు ఎవరివి వారికి ఇచ్చేయాలని నిర్ణయం చేసుకుని ఆ ప్రకారం ఇరు కుటుంబాలు రాజీ చేసుకున్నాయి. 

click me!