
Madhya Pradesh: జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరికి ఎప్పుడు అదృష్టం వరిస్తుందో..? ఎవరికి ఎప్పుడు దురదృష్టం కాటేస్తుందో తెలియదు. అలా అదృష్టం తమ ఇంటి తలుపు కొడితే.. క్షణాల్లో జీవితం మారిపోతుంది. రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయ్యిపోతారు. సరిగ్గా ఇలాంటి ఘటననే మధ్యప్రదేశ్‌లోని ఓ ఇటుక బట్టీ వ్యాపారి జీవితంలో జరిగింది. నిన్నటి వరకూ ఓ కూలి ఉన్న ఆయన నేడు.. ఒక్కసారిగా అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోతారు. ఓ సామాన్య వ్యక్తిగా ఉన్న ఆయనకు
కోట్లు విలువ చేసే వజ్రం దొరికింది. దీంతో ఏళ్ల తరబడి కష్టానికి ఫలితం దక్కిందని భావిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని పట్టణంలోని కిషోర్‌గంజ్ నివసిస్తున్న.. సుశీల్ శుక్లా తవ్వకుండా వదిలేసిన నిస్సార గనిలో చిన్న తరహా ఇటుక బట్టీల వ్యాపారం చేసుకుంటున్నారు. అదే సమయంలో అతను ఆయన కుటుంబంతో కలసి 20 ఏళ్లుగా వజ్రాల మైనింగ్ పనిని కూడా చేస్తున్నాడు. ఎప్పటి లాగానే.. సోమవారం కూడా మైనింగ్ పనుల్లో ఉండగా.. అనుకోకుండా.. ఓ మెరిసే రాయి తార పడింది. తీరా గమనించి చూస్తే.. ఓ సారిగా అవాక్కయారు.
అది మెరిసే రాయి కాదు... 26.11 క్యారెట్ల వజ్రాన్ని కనుగొన్నాడు. దాని విలువ దాదాపు రూ.1.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాను, తన కుటుంబంతో కలసి 20 ఏళ్లుగా వజ్రాల మైనింగ్ పనులు చేస్తున్ననీ, అయితే ఇంత విలువ గల వజ్రం రావడం ఇదే మొదటిసారని శుక్లా చెప్పాడు. అలాగే వజ్రం వేలం ద్వారా వచ్చిన డబ్బుతో వ్యాపారం పెడతానని అన్నాడు. రెండు రోజుల్లో వేలం నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించిన తర్వాత వచ్చిన మొత్తాన్ని మైనర్‌కు అందజేస్తామని ఆయన చెప్పారు. వజ్రం దొరికిన నిస్సార గనిని ఐదుగురు భాగస్వాములతో కలిసి లీజుకు తీసుకున్నట్లు ఆయన చెప్పాడు.
కృష్ణ కళ్యాణ్‌పూర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న గనిలో వజ్రాన్ని కనుగొన్నారని అధికారి తెలిపారు. రత్నాన్ని రెండు రోజుల్లో వేలానికి ఉంచుతామని, ప్రభుత్వ రాయల్టీ, పన్నులు పోగా వచ్చిన డబ్బును సుశీల్ శుక్లానికి అందిస్తామని అధికారి చెప్పారు. కాగా భోపాల్‌కు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల విలువైన వజ్రాలు నిల్వలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.