కింద పడుతున్న చెల్లెని కాపాడిన ఐదేళ్ల బుడతడు..!

Published : Aug 26, 2022, 02:18 PM IST
 కింద పడుతున్న చెల్లెని కాపాడిన ఐదేళ్ల బుడతడు..!

సారాంశం

సెకన్ లో స్పందించి.. తన చెల్లికి దెబ్బ తగలకుండా కాపాడాడు. సోఫాలో నుంచి జారి కింద పడబోతుంటే వెంటనే అలర్ట్ అయ్యి పట్టుకున్నాడు.

ఐదేళ్ల పిల్లాడు అంటే ఎలా ఉంటాడు...? అమ్మ పెట్టింది తిని... ఆడుకుంటూ ఉంటాడు. ఏదైనా అవసరమైతే అడగడమే తప్ప.. వారికి ఏం తెలుస్తుంది. కానీ.. ఈ బుడ్డోడు మాత్రం అలా కాదు. చాలా చురుకు. సెకన్ లో స్పందించి.. తన చెల్లికి దెబ్బ తగలకుండా కాపాడాడు. సోఫాలో నుంచి జారి కింద పడబోతుంటే వెంటనే అలర్ట్ అయ్యి పట్టుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 సీసీ కెమేరాలో రికార్డు అయిన వీడియో ప్రకారం... ఓ ఐదేళ్ల బాలుడు.. తన చెల్లిలితో కలిసి సోఫాలో కూర్చొని ఉన్నాడు. అనుకోకుండా.. ఆ బాలుడి చిట్టి చెల్లెలు సోఫాలో నుంచి కింద కు జారింది. అలా చూశాడో లేదో.. వెంటనే పసిగట్టిన ఆ బాలుడి.. వెంటనే తన చెల్లిని కింద పడుకుండా ఆపాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకి నెటిజన్లు నీరాజం పడుతున్నారు.

 

ఆ బాలుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంత తొందరగా బాలుడు స్పందించిన తీరు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. కావాలంటే.. మీరు కూడా ఈ వీడియో చూసేయండి. అయితే... ఇది ఎక్కడ జరిగింది... ఎప్పుడు జరిగింది అనే విషయం తెలియదు కానీ... నెటిజన్లను మాత్రం ఆకట్టుకుంటోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !