జిన్‌పింగ్, మోడీ భేటీ నేడే: భారీగా స్వాగత ఏర్పాట్లు

By narsimha lodeFirst Published Oct 11, 2019, 7:14 AM IST
Highlights

చైనా, భారత్ మధ్య దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు ఈ రెండు దేశాలు పరిష్కరించుకొనే దిశగా ప్రయత్నాలు చేస్తాయా అనే చర్చనెలకొంది.

న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు తమిళనాడు రాష్ట్రంలోని మామిళ్లపురంలో జరగనుంది. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య నెలకొన్న పలు అంశాలపై చర్చించనున్నారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుక్రవారం నాడు మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయానికి చేరుకొంటారు. చెన్నైకు చేరుకొన్న ఆయన నేరుగా చెన్నైలోని ఐటీసీ హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకొంటారు.

అక్కడి నుండి నేరుగా ఆయన మామిళ్లపురం బయలుదేరుతారు. మామిళ్లపురంలో ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కు స్వాగతం పలుకుతారు.గత ఏడాది చైనాలోని హ్యూహన్ లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు.

రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంతో పాటు కాశ్మీర్ అంశంలో ఇటీవల కాలంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది.దక్షిణ భారత సంప్రదాయ పద్దతుల్లో జిన్‌పింగ్ కు స్వాగతం పలకనున్నారు. చైనా అధ్యక్షుడు రాకను పురస్కరించుకొని చెన్నైలోని ఓ స్కూల్ విద్యార్థులు జిన్ పింగ్ మాస్క్ లు ధరించి చైనా భాషలో  జిన్ పింగ్ ఆకారంలో కూర్చుకొన్నారు.

చెన్నై  నుండి మామిళ్లపురం వెళ్లే వరకు దారికి ఇరువైపులా జిన్‌పింగ్ కు సంప్రదాయ పద్దతుల్లో స్వాగతం పలకనున్నారు. ప్రముఖ నటుడు రజనీకాంత్ కూడ  జిన్ పింగ్, మోడీ భేటీ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి సంబందించిన కార్యక్రమంలో నిర్వహించే కళాకారుల ప్రదర్శనలో పాల్గొంటారు. 

 


 

click me!