మధురై మీనాక్షీ ఆలయానికి బాంబు బెదిరింపు: పోలీసుల తనిఖీలు

Siva Kodati |  
Published : Nov 28, 2019, 03:42 PM IST
మధురై మీనాక్షీ ఆలయానికి బాంబు బెదిరింపు: పోలీసుల తనిఖీలు

సారాంశం

తమిళనాడులోని ప్రఖ్యాత మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డాగ్‌స్క్వాడ్ సాయంతో ఆలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు

తమిళనాడులోని ప్రఖ్యాత మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డాగ్‌స్క్వాడ్ సాయంతో ఆలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కాగా గత రాత్రి మీనాక్షి అమ్మాన్ ఆలయంలో బాంబు పెట్టినట్లు దేవస్థానం అధికారులకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి.

మూడేళ్ల క్రితం మీనాక్షి ఆలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేయడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. అప్పుడు దుండగులు విసిరిన బాంబుల్లో ఒక్కటే పేలడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కలగలేదు .

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం