కర్ణాటక రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్..

Published : Dec 12, 2023, 12:14 PM IST
కర్ణాటక రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్..

సారాంశం

Karnataka Raj bhavan bomb threat : కర్ణాటక రాజ్ భవన్ లో బాంబు పెట్టానని ఓ అజ్ఞాత వ్యక్తి అధికారులకు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్, కే-9 యూనిట్లతో రాజ్ భవన్ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు.

Karnataka Raj bhavan bomb threat : కర్ణాటక రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి అధికారులకు బాంబు హెచ్చరిక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అధికారులు వేగంగా స్పందించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

రాత్రి 11:30 గంటల సమయంలో వచ్చిన ఈ ఫోన్ కాల్ తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. రాజ్ భవన్ ఆవరణపై బాంబులు వేస్తానని అజ్ఞాత వ్యక్తి హెచ్చరించాడు. దీంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు. బాంబును వెతికేందుకు తక్షణం రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్, కే-9 యూనిట్లతో ఘటనా స్థలంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

రాజ్ భవన్ మైదానంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఫోన్ కాల్ ముప్పు విశ్వసనీయతను తెలుసుకునేందుకు, ఆ ప్రాంత భద్రతను నిర్ధారించడానికి సమగ్ర తనిఖీని కొనసాగించారు. అయితే బాంబు హెచ్చరిక చేసిన కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనేది కనిబెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ ఫోన్ నెంబర్ ను ట్రాక్ చేసే పనిలో అధికారులు చురుగ్గా నిమగ్నమయ్యారు.

కాగా.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులను టార్గెట్ గా చేసుకొని దుండగులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. రాజ్ భవన్ లో బాంబు పెట్టినట్టు ఆ సంస్థ అధికారులకే ఫోన్ వచ్చింది. దీంతో ఎన్ఐఏ అధికారులు బెంగళూరు పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో సెంట్రల్ డివిజన్ పోలీసులు విధానసౌధ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

ఇదేందయ్యా ఇదీ.. కర్ణాటక రాజధాని బెంగళూరులో కన్నడ మాట్లాడేవారు తక్కువా..!
హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు