ముంబై హోటల్ కు బాంబు బెదిరింపు... రూ.5కోట్లు ఇవ్వకపోతే పేల్చేస్తాం..చివరికి...

By Bukka SumabalaFirst Published Aug 23, 2022, 12:12 PM IST
Highlights

ముంబైలోని ఓ ప్రముఖ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ హోటల్ లో నాలుగు చోట్ల బాంబు పెట్టామని.. రూ.5 కోట్లు ఇవ్వకపోతే పేల్చేస్తామని బెదిరించారు. 

ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వరుసగా బాంబు బెదరింపులు రావడం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న 26 /11 తరహా పేలుళ్లకు పాల్పడతాం అంటూ ఓ పాకిస్తాన్ నెంబర్ నుంచి పోలీసులకు మెసేజ్ వచ్చింది. తాజాగా మరో ఫైవ్ స్టార్ హోటల్ కు ఈ తరహా బెదిరింపులే వచ్చాయి. హోటల్ లో బాంబు పెట్టామని..రూ. 5 కోట్లు ఇవ్వకపోతే పేల్చేస్తామంటూ ఆగంతకులు ఫోన్ చేశారు. అయితే, అది నకిలీ బెదిరింపు కాల్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ముంబైలోని ప్రముఖ లలిత హోటల్కు ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి హోటల్ లో నాలుగు చోట్ల బాంబులు అమర్చినట్లు తెలిపారు. తమకు రూ.5 కోట్లు ఇవ్వాని, లేదంటే  హోటల్ ను పేల్చేస్తామని బెదిరించారు. దీంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ తో హోటల్కు చేరుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.  దీంతో ఫేక్ కాల్ గా ధ్రువీకరించిన పోలీసులు ఘటన మీద దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఒడిశాలో భీక‌ర వ‌ర‌ద‌లు.. 9 లక్షల మందిపై ప్ర‌భావం.. 38 మంది మృతి.. ప‌లు రాష్ట్రాల్లోనూ వ‌ర్ష బీభ‌త్సం

ఇటీవల ముంబై ట్రాఫిక్ పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ కు బెదిరింపు మెసేజ్లు రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ముంబైలో 26 /11  తరహా దాడులకు పాల్పడతామని, నగరాన్ని పేల్చివేస్తామని  ఆగంతకులు అందులో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల కోసం ఇప్పటికే కొంతమంది తమ మద్దతు దారులు పనిచేస్తున్నట్లు దుండగులు హెచ్చరించినట్లు తెలిపారు. ఆ ఫోన్ నెంబర్ కి పాకిస్తాన్ దేశ కోడ్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన  పోలీసులు బెదిరింపులను తీవ్రంగా పరిగణించారు.  తీర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసి దర్యాప్తు చేపట్టారు. 

click me!