నాలుగేళ్ల చిన్నారి శవాన్ని సంచిలో కుక్కి..!

Published : Jul 31, 2021, 09:52 AM ISTUpdated : Jul 31, 2021, 10:03 AM IST
నాలుగేళ్ల  చిన్నారి శవాన్ని సంచిలో కుక్కి..!

సారాంశం

పోలీసులు ఆ తర్వాత వెంటనే ఫోరెన్సిక్ అధికారులకు, డాగ్ స్క్వాడ్ లకు సమాచారం అందించారు. చిన్నారి చనిపోయి అప్పటికే రెండు రోజులు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు.  

నాలుగేళ్ల చిన్నారి అతి దారుణంగా చంపేశారు. అనంతరం శవాన్ని ఓ సంచిలో కుక్కి.. దానిని ఓ చోట పడేశారు. ఈ దారుణ సంఘటన గుర్గామ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిన్నారి శవం సంచిలో గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడకు వెళ్లి పరిశీలించగా..చిన్నారి శవం కనపడింది. పోలీసులు ఆ తర్వాత వెంటనే ఫోరెన్సిక్ అధికారులకు, డాగ్ స్క్వాడ్ లకు సమాచారం అందించారు. చిన్నారి చనిపోయి అప్పటికే రెండు రోజులు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు.

ఆ చిన్నారిని చంపింది ఎవరు..? అసలు చనిపోయిన ఈ చిన్నారి ఎవరు అనే విషయంపై స్పష్టత లేదు. దగ్గరలోని సీసీటీవీ కెమేరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం