హథ్రస్ ఘటన.. నిందితుడి ఇంట్లో రక్తం మరకల దుస్తులు

Published : Oct 16, 2020, 04:02 PM IST
హథ్రస్ ఘటన.. నిందితుడి ఇంట్లో రక్తం మరకల దుస్తులు

సారాంశం

ఈ సోదాల్లో నిందితుడు లవ్‌ కుశ్‌ సికార్వర్‌ ఇంట్లో రక్తపు మరకలతో కూడిన దుస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

హథ్రస్ దళిత యువతి అత్యాచారం కేసులో దర్యాప్తును సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. గ్రామంలో తాత్కాళిక కార్యాలయం ఏర్పాటు చేసి మరీ దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే పలుమార్లు బాధితురాలి కుటుంబసభ్యులను విచారించారు. 

కాగా.. తాజాగా నిందితుల కుటుంబసభ్యుల అధికారులను విచారించారు.  ఈ కేసుకు సంబంధించి ఆధారాల కోసం వారి ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుడు లవ్‌ కుశ్‌ సికార్వర్‌ ఇంట్లో రక్తపు మరకలతో కూడిన దుస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అయితే ఈ వార్తల్ని నిందితుడి కుటుంబసభ్యులు ఖండించారు. లవ్‌ కుశ్‌ సోదరుడు రవి ఓ ఫ్యాక్టరీలో పెయింటర్‌గా పని చేస్తున్నాడని, అందుకే అతడి బట్టలు ఎర్ర పెయింట్‌తో మాసిపోయి ఉన్నాయని చెప్పారు. అది కేవలం ఎర్ర రంగు మాత్రమేనని సీబీఐ అధికారులు భావిస్తున్నట్లుగా రక్తపు మరకలు కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు నిందితుడి సోదరుడు లలిత్‌ ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశాడు.

PREV
click me!

Recommended Stories

వినాశకాలే విపరీత బుద్ధి..అయోధ్యలో రాములోరి కళ్లెదుటే | Ayodhya Ram Mandir Donation Theft?
Indian Railways: మరీ ఇంత కక్కుర్తా? ట్రైన్‍లో దుప్పట్లు, ఫేస్ టవల్స్ ఎత్తుకెళ్లిన ప్యాసింజర్లు..రైల్వేకు రూ.కోట్ల నష్టం