ప. బెంగాల్ లో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి

By narsimha lodeFirst Published Apr 18, 2019, 3:30 PM IST
Highlights

బెంగాల్ రాష్ట్రంలోని పురూలియా ప్రాంతంలో బీజేపీ యువజన విభాగంనేత అనుమానాస్పద స్థితిలో మరణించాడు.  అయితే  తమ పార్టీ నేతను ప్రత్యర్థులు హత్య చేశారని  బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.


కోల్‌కత్తా:బెంగాల్ రాష్ట్రంలోని పురూలియా ప్రాంతంలో బీజేపీ యువజన విభాగంనేత అనుమానాస్పద స్థితిలో మరణించాడు.  అయితే  తమ పార్టీ నేతను ప్రత్యర్థులు హత్య చేశారని  బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మృతి చెందిన బీజేపీ నేతను శిశుపాల్ సాహీస్‌గా గుర్తించారు.  సేనబన గ్రామంలో  ఇవాళ ఉదయం  శిశుపాల్ సాహీస్ ఓ చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

శిశుపాల్‌ది హత్యా... ఆత్మహత్యా  అనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.శిశుపాల్ సాహీస్ తండ్రి శిర్కబాద్ గ్రామ పంచాయితీ డిప్యూటీ ప్రధాన్‌గా ఉన్నాడు. పురూలియాలో ఈ ఏడాది మే 12 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

పురూలియా ఎంపీ స్థానాన్ని 2014 ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. ఈ ఎన్నికల్లో బీజేపీని కూడ ఈ రెండు పార్టీలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఈ పురూలియా. ఈ ప్రాంతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా,  నరేంద్ర మోడీతో పాటు  పలువురు కేంద్ర మంత్రులు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

click me!