Manipur elections 2022: బీజేపీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఈశాన్య రాష్ట్రంలో ఒంట‌రి పోరు.. వ్యూహం ఫ‌లించేనా?

Published : Jan 30, 2022, 06:51 PM IST
Manipur elections 2022: బీజేపీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఈశాన్య రాష్ట్రంలో ఒంట‌రి పోరు..  వ్యూహం ఫ‌లించేనా?

సారాంశం

Manipur elections 2022: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. నిన్నటివరకు నేషనల్ పీపుల్స్ పార్టీ(NPP)తో కలిసి బీజేపీ పోటీ చేయనుందని అందరూ భావించినా.. సీట్ల పంప‌కంలో  ఇరు పార్టీ మధ్య భేదాభిప్రాయం కుదరక‌పోవ‌డంతో బీజేపీ ఒంట‌రిగా బ‌రిలో దిగ‌నున్న‌ది. మణిపూర్‌లో బీజేపీలో చేరిన 16 మంది ఎమ్మెల్యేలలో కనీసం 10 మంది మాజీ కాంగ్రెస్‌ నేతలకు టిక్కెట్లు లభించాయి.

Manipur elections 2022: మణిపూర్‌లో  BJP  మ‌రోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. ఈ మేర‌కు బీజేపీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఒంటరిగా బ‌రిలో దిగాల‌ని బీజేపీ సిద్ధమైంది. నిన్నటి వ‌ర‌కు మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)తో కలిసి బీజేపీ పోటీ చేయనుందని భావించారు. కానీ,  ఇరు పార్టీ మధ్య సీట్ల పంపకాల్లో ఏకాభిప్రాయం రాక‌పోవ‌డంతో 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీ 40 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు NPPఅధినేత కోన్రాడ్ సంగ్మా ప్రకటించారు. అయితే సగంపైగా స్థానాలు కావాలని బీజేపీ కోరిన‌ట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఇరు పార్టీలు కలిసి ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేశాయి. 

కానీ, అనూహ్యంగా... మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 60 స్థానాల్లో పోటీ చేస్తుందని, నేడు బీజేపీ అధిష్టానం తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆ కార్యక్రమంలో కోన్రాడ్ సంగ్మా, మణిపూర్ డిప్యూటీ సీఎం వై.జోయ్ కుమార్‌ లతో పాటు ఇరు పార్టీల అధినేతలు పాల్గొన్నారు. కానీ బీజేపీ అధిష్టానం సగం సీట్లు కావాలంటూ కోన్రాడ్‌ను కోరింది. ఆయన అందుకు ఒప్పుకోకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగడానికి బీజేపీ సిద్ధపడింది. నేషనల్ పీపుల్స్ పార్టీతో పొత్తు వికటించడంతో ఒంటరిగానే పోటీకి వెళ్తున్నట్లు బీజేపీ ఆదివారం ప్రకటించింది.

బిజెపి మణిపూర్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ భూపేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ మొత్తం 60 స్థానాల్లో పోటీ చేస్తుంద‌నీ, త‌న పార్టీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందనీ, మోడీ ప్రభుత్వం మణిపూర్‌లో సుస్థిర ప్రభుత్వం వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు మణిపూర్ అభివృద్ధి, శాంతిభద్రతల‌కు మెరుగుప‌ర‌చ‌డంలో బీజేపీ కృషి చేసుంద‌ని యాదవ్ అన్నారు. కాగా,సీఎం బీరేన్ సింగ్ హెయిన్ గాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ మంత్రి బిశ్వజిత్ సింగ్.. థోంగ్జు స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి సోమతై... సైజా ఉఖ్రుల్ నుంచి పోటీ చేయనున్నారు.

2017 ఎన్నికల్లో.. బీజేపీ 21 స్థానాలను గెలుపు పొంది.. స్వతంత్ర ఎమ్మెల్యేల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వీరిలో 19 మంది ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్లు ఇవ్వగా, ఇద్దరిని తొలగించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మణిపూర్ బీజేపీ ముగ్గురు మహిళలు, ఒక ముస్లిం అభ్యర్థిని మాత్రమే బరిలోకి దింపింది. అలాగే .. ఇటీవ‌ల బీజేపీలో చేరిన మణిపూర్ కాంగ్రెస్ మాజీ చీఫ్ గోవిందాస్ బీజేపీ  బ‌రిలో దించింది. మణిపూర్‌లో బీజేపీలో చేరిన 16 మంది ఎమ్మెల్యేలలో కనీసం 10 మంది మాజీ కాంగ్రెస్‌ నేతలకు టిక్కెట్లు లభించాయి.

 2017లో మణిపూర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్, కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. 21 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు నాగా పీపుల్స్ ఫ్రంట్, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలుతో కలిసి సంకీర్ణప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన మణిపూర్ లో రెండు దశల్లో(ఫిబ్రవరి-27,మార్చి-3)అసెంబ్లీ ఎన్నికలు జరుగన్నాయి. మొదటి దశ ఎన్నికలకు ఫిబ్రవరి-1న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి-11 చివరి తేదీ. ఫిబ్రవరి-3న రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి-16చివరి తేదీ. మార్చి-10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మ‌రి ఈ సారి ఒంట‌రిగా బరిలో దిగిన బీజేపీ.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తోందో?  లేదో ?  వేచి చూడాలి.

PREV
click me!

Recommended Stories

India Gate Ahead of Republic Day 2026: త్రివర్ణ దీపాల కాంతులతో ఇండియా గేట్ | Asianet Telugu
Fresh Snowfall in Sonamarg: మోదీ ప్రారంభించిన సోనమార్గ్ఇప్పుడు ఎలా ఉందో చూడండి| Asianet News Telugu