కాంగ్రెస్ హయాంలోనే మత ఘర్షణలు ఎక్కువ: జేపీ నడ్డా బహిరంగ లేఖ

Published : Apr 18, 2022, 01:01 PM IST
కాంగ్రెస్ హయాంలోనే మత ఘర్షణలు ఎక్కువ: జేపీ నడ్డా బహిరంగ లేఖ

సారాంశం

ప్రతిపక్ష పార్టీలు జారీ చేసిన సంయుక్త ప్రకటనకు సమాధానంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ లేఖలో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే మత ఘర్షణలు ఎక్కువ జరిగాయని ఆరోపించారు. దళితులు, గిరిజనులపైనా భయానక దాడులు జరిగాయని పేర్కొన్నారు.  

న్యూఢిల్లీ: దేశంలో మత ఘర్షణలు పెరిగిపోతున్నాయని, వాటిపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడం పరోక్షంగా ఆ మూకలకు బలాన్ని చేకూరుస్తున్నదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 13 ప్రతిపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సంయుక్త ప్రకటనకు సమాధానంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ స్టేట్‌మెంట్ జారీ చేశారు. అందులో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. కాంగ్రెస్ హయాంలోనే దేశంలో మత ఘర్షణలు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు.

జేపీ నడ్డా తన లేఖలో కాంగ్రెస్ హయాంలో జరిగిన ఘర్షణలను ఏకరువు పెట్టారు. 1969లో గుజరాత్‌లో, 1980లో మొరదాబాద్‌లో, 1984లో భీవండిలో, 1987లో మీరట్‌లో, 1980 దశకంలో కశ్మీర్ లోయలో హిందువులపై ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు, 1989లో భగల్‌పూర్‌లో, 1994లో హుబ్బలిలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయని వివరించారు. కాంగ్రెస్ హయాంలోనే మత ఘర్షణల జాబితా చాలా పెద్దగా ఉన్నదని పేర్కొన్నారు.

అంతేకాదు, దళితులు, ట్రైబల్స్‌లపైనా భయానక దాడులు కాంగ్రెస్ హయాంలోనే చోటుచేసుకున్నాయని వివరించారు. అదే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించిందనీ పేర్కొన్నారు.

ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని, విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆ బహిరంగ లేఖలో జేపీ నడ్డా తెలిపారు. ఈ పనికిమాలిన రాజకీయాలు వదిలిపెట్టుకోవాలని సూచించారు. వాటికి బదులు అభివృద్ధికి దోహదపడే వైపు నడవాలని తెలిపారు.

దేశంలో పేదరికాన్ని అంతమొందించడానికి, పురోగతిలో సరికొత్త మైలురాళ్ల వైపు తీసుకెళ్లడానికి అన్ని విశ్వాసాల వారు, అన్ని గ్రూపుల వారు కలిసి నడవడానికి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి, ప్రతిపక్షాలు తమ చిల్లర రాజకీయాలు వదిలి అభివృద్ధి రాజకీయాలు చేయాలని సూచించారు.

ప్రతిపక్ష నేలు శనివారం ఓ సంయుక్త ప్రకటన చేశాయి. దేశంలో మతోన్మాద ఘర్షణలు పెరుగుతుండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం మౌనం దాల్చారని ఆరోపించాయి. మతోన్మాదాన్ని  తమ చర్యలు, మాటల ద్వారా రెచ్చగొడుతున్నవారిని చూస్తూ వారించకుండా, కనీసం ఖండించకుండా ప్రధాని మోడీ మౌనం వహించడం తమను ఆందోళనలో ముంచుతున్నదని ప్రతిపక్ష నేతలు తెలిపారు. ఈ మౌనాన్ని ఆ సాయుధ మూకలకు బలాన్ని చేకూరుస్తున్నాయని, ఒకరకంగా పరోక్షంగా అధికారిక అండనూ
పొందుతున్నాయని ఆరోపించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇటీవలే చోటుచేసుకున్న మత ఘర్షణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మత ఘర్షణల వెనుక కుట్రపూరిత రెచ్చగొట్టుడు ధోరణులు కనిపించాయని, మతపరమైన యాత్రల్లోనూ ఆయుధాలు కలిగి మత ఘర్షణలకు పాల్పడ్డట్టు కనిపిస్తున్నదని తెలిపారు.

ఈ లేఖపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, జేకేఎన్‌సీ, మరికొన్ని పార్టీలు ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్