కేజ్రీవాల్ కు లగే రహో చిక్కులు: రూ. 500 కోట్లకు దావా

By telugu teamFirst Published Jan 13, 2020, 10:40 AM IST
Highlights

లగే రహో కేజ్రీవాల్ గీతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చిక్కులు తెచ్చేపెట్టే విధంగానే ఉంది. ఆ గీతం తన మేధోసంపత్తి హక్కు అని, దానిపై రూ.500 కోట్లకు దావా వేస్తానని బిజెపి నేత మనోజ్ తివారీ అంటున్నారు.

న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపిల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ర్యాలీలో బిజెపి ఎంపీ, బిజెపి ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇటీవల విడదుల చేసిన లగే రహో కేజ్రీవాల్ ప్రచారం గీతంపై ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పాట తన బోజ్ పురి మ్యూజిక్ ఆల్బమ్ కు చెందిన ఎడిటెడ్ వెర్షన్ అని, తన పాటను కాపీ చేసే హక్కు ఆప్ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. 

దానిపై తాను న్యాయపోరాటానికి దిగుతానని, తన మేధో సంపత్తి హక్కులు వాడుకున్నందుకు రూ.500 కోట్లకు దావా వేస్తానని మనోజ్ తివారీ చెప్పారు. దానిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆ మేరకు నోటీసులు పంపినట్లు కూడా చెప్పారు. 

అబద్దాలను ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ బిజెపి విజయం సాధించడం ఖాయమని అన్నారు. తన ప్రచారంలో భాగంగా ఆప్ ఓ గీతాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. లగే రహో కేజ్రీవాల్ అంటూ సాగే ఆ గీతం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. 

click me!