లిక్కర్ తాగు, తంబాకు నములు, గంజాయి తీసుకో, కానీ.. : బీజేపీ ఎంపీ విచిత్ర వ్యాఖ్యలు

Published : Nov 08, 2022, 08:29 AM IST
లిక్కర్ తాగు, తంబాకు నములు, గంజాయి తీసుకో, కానీ..  : బీజేపీ ఎంపీ విచిత్ర వ్యాఖ్యలు

సారాంశం

బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా విచిత్ర వ్యాఖ్యలు చేశారు. భూగర్భ జలాలను కాపాడాలనే విషయాన్ని కొంత చిత్రంగా చెప్పారు. లిక్కర్ తాగు, తంబాకు నములు, గంజాయి తీసుకో.. కానీ, నీటికి ఉన్న ప్రాధాన్యతను తెలుసుకో అంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.  

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా ఇటీవలే విచిత్ర వ్యాఖ్యలు చేశారు. భూగర్భ జలాల సంరక్షణ గురించి మాట్లాడుతూ అందరూ షాక్‌కు గురయ్యే వ్యాఖ్యలు చేశారు. ‘భూమిలో నీరు లేకుండా పోతున్నది. భూగర్భ జలాలను కాపాడుకోవాలి.. ఆల్కహాల్ తాగు.. తంబాకు నములు.. గంజాయి తీసుకో.. థిన్నర్ లేదా సొల్యూషన్‌ను స్మెల్ చూడు.. ఏమైనా చేయ్ కానీ, నీటికి ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకో..’ అని ఆయన కామెంట్ చేశారు. ఈ కామెంట్ చాలా మంది దృష్టిని ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నది.

మధ్యప్రదేశ్‌లో రేవాలోని క్రిష్ణరాజ్ కపూర్ ఆడిటోరియంలో ఓ వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో అడుగంటిపోతున్న నీటి నిల్వల అంశంపై బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా వ్యాఖ్యలు చేశారు.

 

బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా తరచూ వివాదాస్పద, విచిత్ర పనులు, వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. రేవా ఎంపీ మిశ్రా ఇటీవలే టాయిలెట్‌ను శుభ్రం చేస్తూ కనిపించారు.  ఎలాంటి బ్రాష్, గ్లౌజులు లేకుండా చేతులతోనే స్వ‌యంగా టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్నాడు. గుణ జిల్లా చక్‌దేవ్‌పూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను 5-6 తరగతులు చదువుతున్న బాలికలతో గత మంగళవారం శుభ్రం చేయించారు.  ఈ వీడియోను స్వయంగా ట్వీట్ చేసి, ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు.

బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరయ్యేందుకు ఎంపీ మౌగంజ్‌లోని ఖత్వారీ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ప్రభుత్వ బాలికల పాఠశాలకు చేరుకున్నారు. పాఠ‌శాల‌ను తనిఖీ చేసిన ఆయ‌న మరుగుదొడ్డి అపరిశుభ్రంగా కనిపించడంతో సిబ్బందిపై సీరియ‌స్ అయ్యారు. అనంతరం ఎంపీ స్వయంగా తన చేతులతో శుభ్రం చేయడం ప్రారంభించారు. టాయిలెట్‌లో శుభ్రం చేసేటప్పుడు క‌నీసం బ్రష్‌లు, గ్లౌజులు కూడా వేసుకోలేదు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !