దీపావళి పండగ తరువాత ఫడ్నవీస్, చంద్రకాంత్ పాటిల్,అమిత్ షా, ఉద్దవ్ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య సమసిపోతుందని దీనిపై కాంగ్రెస్ ఆఫర్స్ ఇవ్వవలిసిన అవసరం లేదని తెలిపింది. ఏర్పడేది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఆకలేసింది కదా అని పులి గడ్డి తినదు కదా అని కాంగ్రెస్ ఆఫర్ ని గడ్డితోని పోల్చారు.
ముంబై:మహారాష్ట్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఫలితాలు వెలువడ్డ తరువాత కూడా ఇంకా కాక మీదనే ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ శివసేనల కూటమి మేజిక్ మార్కును దాటినా బీజేపీ సీట్లు మాత్రం గత దఫా కన్నా తగ్గాయి. సొంతంగా బీజేపీ కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు.
బీజేపీ సీట్లు తగ్గడంతో శివ సేన 50-50 ఫార్ములా కావాలని అడుగుతుంది. సీట్ల పంపకాలప్పుడే తమకు సగం సీట్లివ్వలేదని శివసేన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేసింది. ఇప్పుడు బీజేపీ సీట్లు కూడా తగ్గడంతో శివసేన 50-50 ఫార్ములా కావాల్సిందేనని పట్టుపడుతుంది.
undefined
ముఖ్యమంత్రి పదవి రెండున్నర సంవత్సరాలపాటు రొటేషన్ పద్దతిలో పంచుకోవాల్సిందేనని అంటుంది. మొదటి రెండున్నరేళ్లు తమ అభ్యర్థి ఆదిత్య ఠాక్రే కు ఇవ్వాల్సిందేనని శివసేన పట్టుబడుతోంది.
నిన్న కాంగ్రెస్ నేత మాట్లాడుతూ,అవసరమైతే శివసేనకు మద్దతిచ్చేందుకు తాము సిద్ధమేనని అన్నాడు. శరద్ పవార్ కూడా ఇదే విషయమై మాట్లాడాడు. శివసేన అధికార పత్రిక సామ్నాలో కూడా బీజేపీ తరహా పొగరుబోతు రాజకీయాలు పనికిరావని పేర్కొంది.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆఫర్ పై బీజేపీ మహారాష్ట్ర నేతలు విరుచుకుపడ్డారు. శివసేనకు కాంగ్రెస్ ఎటువంటి ఆఫర్స్ ఇవ్వాల్సిన అవసరంలేదని బీజేపీ నేత సుధీర్ ముంగంటివారు అన్నారు. రెండు పార్టీల మధ్య ఉన్నయి చిన్న సమస్యలేనని,ఉద్ధవ్ ఠాక్రే ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపెట్టగలరని అన్నాడు.
దీపావళి పండగ తరువాత ఫడ్నవీస్, చంద్రకాంత్ పాటిల్,అమిత్ షా, ఉద్దవ్ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య సమసిపోతుందని దీనిపై కాంగ్రెస్ ఆఫర్స్ ఇవ్వవలిసిన అవసరం లేదని తెలిపింది. ఏర్పడేది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఆకలేసింది కదా అని పులి గడ్డి తినదు కదా అని కాంగ్రెస్ ఆఫర్ ని గడ్డితోని పోల్చారు.
మరోవైపు ఈ విషయమై శివసేన 50-50 ఫార్ములాకు పట్టుబట్టి కూర్చున్నాయి. ఏకంగా తాము కింగ్ మేకర్ స్థానంలో ఉన్నామని అన్నారు ఆ పార్టీ నేత ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ అన్నారు. మొదటి రెండున్నరేళ్లు ఆదిత్య ఠాక్రే ముఖ్యమంత్రి పదవిలో కూర్చొవాలిసిందే అని, తరువాత రెండున్నరేళ్లు ఎవరు ముఖ్యమంత్రి అయినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. తమకు ఇప్పుడు చాల ఆప్షన్స్ ఉన్నాయని, బీజేపీ మా ప్రతిపాదనలు ఒప్పుకుంటే సరి లేదంటే మేము వేరే ద్వారం ఓపెన్ చేస్తాము. ప్రస్తుతం మా కింగ్ మేకర్ స్థానం అటువంటిది. మేము లేకుండా ఎవ్వరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేరని సర్నాయక్ అన్నారు.