దీపావళి ఆఫర్: 1రూపాయికి షర్ట్,10 కి నైటీ

Published : Oct 27, 2019, 11:01 AM ISTUpdated : Oct 27, 2019, 08:53 PM IST
దీపావళి ఆఫర్: 1రూపాయికి షర్ట్,10 కి నైటీ

సారాంశం

వస్త్ర దుకాణం దీపావళికి స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. పండగపూట పేదలు కూడా కొత్త బట్టలు వేసుకొని ఆనందమయంగా పండగ జరుపుకోవాలనేది ఈ దుకాణం యజమాని అభిలాష.

చెన్నై: చెన్నైలోని ఒక వస్త్ర దుకాణం దీపావళికి స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. పండగపూట పేదలు కూడా కొత్త బట్టలు వేసుకొని ఆనందమయంగా పండగ జరుపుకోవాలనేది ఈ దుకాణం యజమాని అభిలాష. అందుకోసం దీపావళికి ఒక వారం ముందు నుంచి ఈ ఆఫర్ కింద బట్టలను పెద్ద ప్రజలకు అందించాడు. 

ఒక షర్ట్ ను కేవలం ఒక్క రూపాయికి, ఒక నైటీని 10 రూపాయలకు విక్రయించాడు. పండగనేది కేవలం ఏ కొద్దిమందికో మాత్రమే కాకుండా అందరికి చేరువ చేయడానికి ఇలా బట్టలను అందించినట్టు దుకాణం యజమాని తెలిపాడు.  

చెన్నై ట్రిప్లికేన్ ప్రాంతంలోని చాకలిపేట్ ఏరియాలో ఆనంద్ అనే ఒక వ్యక్తి వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. దీపావళికి వారం ముందు నుంచి 19వ తేదీ నుండి నిన్న 26వ తేదీ వరకు రోజు ఒక గంటపాటు ఉదయం 10 నుండి 11గంటల వరకు ఇలా అమ్మేవాడు. తొలి రోజుల్లో కేవలం 50 మందికి మాత్రమే ఇచ్చేవాడు. రానురాను రద్దీ పెరగడంతో రోజుకి 200 మందికి ఇలా ఇవ్వడం ప్రారంభించాడు. 

రూపాయికి ఏమి రాదూ కదా,మరి ఎందుకు ఇలా రూపాయి తీసుకోవడం?దాని బదులు ఉచితంగా ఇవ్వొచ్చు కదా అని అడిగితే,ఫ్రీగా ఇస్తే విలువ తెలియదు,అందుకే ఇలా రూపాయి తీసుకోవడం అని సమాధానమిస్తున్నారు మోహన్. 

PREV
click me!

Recommended Stories

Smallest Train in India : చేయి ఎత్తితే ఆగే రైలు.. ఇవే దేశంలో అతిచిన్న రైళ్లు
Smoking: ఇక చచ్చిన‌ట్లు స్మోకింగ్ మానేస్తారు.. 72 రూపాయలు కానున్న ఒక సిగరెట్ ధర.?