హస్తినలో వేడెక్కిన రాజకీయం: ఎన్డీఏ అగ్రనేతలకు షా విందు

Published : May 21, 2019, 04:21 PM IST
హస్తినలో వేడెక్కిన రాజకీయం: ఎన్డీఏ అగ్రనేతలకు షా విందు

సారాంశం

మంగళవారం సాయంత్రం అమిత్ షా ఎన్డీఏ కూటమి అగ్రనేతలకు విందు ఆఫర్ చేశారు. ఈ విందుకు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. అలాగే బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సైతం హాజరుకానున్నట్లు సమాచారం. 

ఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాలతో బీజేపీ మాంచి హుషారుగా ఉంది. ఎన్డీఏ కూటమి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తేటతెల్లమవ్వడంతో బీజేపీ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం మెుదలు పెట్టింది. 

పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విందుకు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం అమిత్ షా ఎన్డీఏ కూటమి అగ్రనేతలకు విందు ఆఫర్ చేశారు. ఈ విందుకు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. 

అలాగే బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సైతం హాజరుకానున్నట్లు సమాచారం. బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్డీఏ అగ్రనేతలకు విందు ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు జేడీయూ తరపున రాజ్యసభ సభ్యుడు ఆర్పీ సింగ్ ను పంపిచాలని నితీశ్ కుమార్ భావించారు. 

అయితే రాజకీయ అంశాలు కూడా కీలకంగా ప్రస్తావించే అవకాశం ఉన్న నేపథ్యంలో నితీష్ కుమార్ స్వయంగా హాజరుకానున్నారు. నితీష్ కుమార్ తోపాటు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, లోక్ జన శక్తి పార్టీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. 

న్డీఏ కూటమిలో కీలక నేతగా ఉన్న జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ గత కొంతకాంలగా బీజేపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్న తరుణంలో ఆయన బీజేపీతో విభేదాలు లేవని స్పష్టం చేశారు సీఎం నితీష్ కుమార్.  

PREV
click me!

Recommended Stories

దేశ ఎగుమతుల్లో ఈ రాష్ట్రం టాప్... ఏడాదికి ఇన్నివేల కోట్లా..!
నేను కూడా భారతీయుడినే..European Council President Surprises PM Modi | PM Modi | Asianet News Telugu