మోదీ నన్ను చంపాలనుకుంటున్నారు: కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

Published : May 21, 2019, 03:39 PM IST
మోదీ నన్ను చంపాలనుకుంటున్నారు: కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

సారాంశం

ప్రధాని నరేంద్రమోదీ తనను చంపాలనకుంటున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఇందిరాగాంధీలా తనను కూడా ఏదోఒకరోజు బీజేపీ తనను కూడా హత్య చేయించాలని చూస్తోందన్నారు. అందుకు తన పీఎస్వో నే టార్గెట్ గా చేసుకుందన్నారు. 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తనను చంపాలనకుంటున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఇందిరాగాంధీలా తనను కూడా ఏదోఒకరోజు బీజేపీ తనను కూడా హత్య చేయించాలని చూస్తోందన్నారు. 

అందుకు తన పీఎస్వో నే టార్గెట్ గా చేసుకుందన్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది పై అనుమానం ఉంటే నచ్చినవాళ్లను నియమించుకోవచ్చునంటూ కేంద్రమంత్రి విజయ్ గోయల్  అరవింద్ కేజ్రీవాల్ కు సూచించారు. దానిపై స్పందించిన కేజ్రీవాల్ తనను చంపాలనుకుంటున్నది మోదీయేననీ, పీఎస్‌వో కాదన్నారు. 

బీజేపీ వల్ల తన ప్రాణాలకు ముప్పుందనీ ఏదో ఒక రోజు ఆ పార్టీ తనను హత్య చేయిస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇందిరా గాంధీలాగే ఏదో ఒక రోజు బీజేపీ కూడా తనను తన సొంత పీఎస్‌వోతోనే హత్య చేయిస్తుందన్నారు. తన సొంత భద్రతాధికారులు బీజేపీకి సమాచారం చేరవేస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. 

కేజ్రీవాల్ ఆరోపణలపై స్పందిచన కేంద్రమంత్రి విజయ్  గోయల్  కేజ్రీవాల్‌ తన పీఎస్‌వోనే అనుమానిస్తున్నారని పేర్కొన్నారు. మీ సొంత పీఎస్‌వోనే అనుమానించడం బాధాకరం. ఇలా చెప్పడం ద్వారా మీరు ఢిల్లీ పోలీసుల గౌరవానికి భంగం కలిగించారు. 

మీకు నచ్చిన పీఎస్‌వోను మీరే ఎంచుకోండి. ఏదైనా సాయం కావాలంటే నాకు చెప్పండి. మీరు దీర్ఘాయుష్మంతులు కావాలని కోరుకుంటున్నాను అంటూ గోయల్ ట్వీట్ చేశారు. గోయల్ ట్వీట్ పైనా ఘాటుగా స్పందించారు కేజ్రీవాల్ . తనను చంపాలనుకున్నది తన పీఎస్‌వో కాదని ప్రధాని నరేంద్రమోదీయే చంపించాలని చూస్తున్నారని ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

దేశ ఎగుమతుల్లో ఈ రాష్ట్రం టాప్... ఏడాదికి ఇన్నివేల కోట్లా..!
నేను కూడా భారతీయుడినే..European Council President Surprises PM Modi | PM Modi | Asianet News Telugu