రెండు రోజుల్లో పోలింగ్..కుమారస్వామి భార్య జోష్, కాంగ్రెస్ లోకి బీజేపీ నేత

Published : Nov 01, 2018, 03:35 PM ISTUpdated : Nov 05, 2018, 05:27 PM IST
రెండు రోజుల్లో పోలింగ్..కుమారస్వామి భార్య జోష్, కాంగ్రెస్ లోకి బీజేపీ నేత

సారాంశం

తన నామినేషన్ ని ఉపసంహరించుకున్నాడు. అంతేకాదు.. వెంటనే పార్టీ కూడా మారిపోయాడు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేశాడు.

కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఊహించని షాక్ తగిలింది. మరో రెండు రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్న సమయంలో.. బీజేపీ తరపు నుంచి పోటీ చేసే వ్యక్తి.. తన నామినేషన్ ని ఉపసంహరించుకున్నాడు. అంతేకాదు.. వెంటనే పార్టీ కూడా మారిపోయాడు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేశాడు.

పూర్తి మ్యాటర్లోకి వెళితే...ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో సీఎం కుమారస్వామి రామనగర, చెన్నపట్న రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన రామనగర నియోజకవర్గ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో.. ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. 

ఈ ఉప ఎన్నికలో జేడీఎస్ నుంచి కుమార స్వామి తన భార్య అనితను బరిలోకి దించారు. ఆమె నామినేషన్ కూడా వేశారు. కాగా.. బీజేపీ నుంచి ఎల్. చంద్రశేఖర్ నామినేషన్ వేశారు.  కర్ణాటక ప్రభుత్వాన్ని కాంగ్రెస్, జేడీఎస్ కలిసి నిర్మించాయి కాబట్టి.. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దూరంగా ఉంది.  సరిగ్గా రెండు రోజుల్లో ఉప ఎన్నిక ఉంది అనగా.. చంద్రశేఖర్ తన నామినేషన్ ఉప సంహరిచుకొని, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 

ఈ హఠాత్ పరిణామానికి బీజేపీ కంగుతిన్నది. ఇప్పుడు కుమార స్వామి భార్య అనితకు ఎవరూ పోటీ లేకుండా పోవడం గమనార్హం. దీంతో ఆమె గెలుపు ఖాయమని స్పష్టంగా అర్థమౌతోంది. 


 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్