KK Death: సింగర్ కేకే మరణంపై అనుమానాలు.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ ఫైర్

Published : Jun 01, 2022, 02:15 PM IST
KK Death: సింగర్ కేకే మరణంపై అనుమానాలు.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ ఫైర్

సారాంశం

ప్రముఖ బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ కేకే మరణంపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేకే మరణంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని దీదీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగ్ కేకే మరణంపై రాజకీయ దుమారం రేగేలా ఉన్నది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆరోపణలు సంధించారు. సింగర్ కేకే పాల్గొన్న కాన్సర్ట్ జరుగుతుండగా కోల్‌కతా అడ్మినిస్ట్రేషన్ తగిన చర్యలు తీసుకోలేని ఆరోపించారు.

సింగర్ కేకే కోల్‌కతాలోని నజ్రుల్ మంచాలో ఓ ప్రోగ్రామ్ చేశాడు. అయితే, ఈ వేదిక ఏర్పాట్లు సరిగా లేవని, నిర్వహణలోనూ అనేక లోటుపాట్లు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అంత వేడిగా ఉన్నప్పటికీ ఏసీలను ఆఫ్ చేశారని, హాల్ సామర్థ్యం 2,500 నుంచి 3000 మందిగా ఉండగా.. కేకే కాన్సర్ట్‌కు దాదాపు రెట్టింపు మంది హాల్‌లోకి వచ్చారని కొందరు ఆరోపించారు. దీంతో ఆడిటోరియం డోర్లు, గార్డ్ రైల్స్ కూడా ధ్వంసం  అయ్యాయని పేర్కొన్నారు. ఈ కాన్సర్ట్ కు సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఆడిటోరియంలో హీట్‌ గురించి కేకే మాట్లాడుతున్నట్టుగా ఓ వీడియోల కనిపించింది. తన చెమటలను తువ్వాకు తుడిచి ఏసీ గురించి మాట్లాడినట్టు ఉన్నదని ఇండియా టుడే కథనం వెల్లడించింది.

ఈ ఆరోపణల నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ చీఫ్, ప్రస్తుత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ వార్తలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయని ఆరోపించారు. సెలెబ్రిటీలు రాష్ట్ర పర్యటనలో ఉన్నప్పుడు వారికి రక్షణ ఇవ్వడంలోనూ బెంగాల్ ప్రభుత్వం విఫలం అయిందన్న విషయాన్ని ఈ ఆరోపణలు పేర్కొంటున్నాయని వివరించారు. అడ్మినిస్ట్రేషన్‌పై పూర్తిగా నియంత్రణ కోల్పోయినట్టుగా ఉన్నదని తెలిపారు. సెలెబ్రిటీలు రాష్ట్ర పర్యటన చేసినప్పుడు నిర్వాహణ లోపాలే ఇలాంటి దుస్థితిని కల్పిస్తాయని ఆరోపించారు. సెలెబ్రిటీలు అందరికీ రక్షణ కల్పించే బాధ్యత అడ్మినిస్ట్రేషన్‌కు ఉంటుందని వివరించారు.

కేకే మరణంపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేకే మృతదేహానికి గన్ సెల్యూట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. కేకే డెడ్ బాడీని నగరం నుంచి బయటకు తీసుకెళ్లడానికి ముందు  కోల్‌కతా ఎయిర్ పోర్టులో గన్ సెల్యూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నది. ఒక వేళ వాతావరణ సరిగా ఉంటే తాను హెలికాప్టర్‌లో కోల్‌కతాకు చేరుకుంటానని, డుమ్ డుమ్ ఎయిర్ పోర్టులో కేకే మృతదేహానికి గన్ సెల్యూట్ చేసే ఆలోచనలో ఉన్నామని సీఎం మమతా బెనర్జీ వివరించారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం