యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. కానీ, వారణాసిలో.. !

Published : Apr 12, 2022, 02:42 PM ISTUpdated : Apr 12, 2022, 02:44 PM IST
యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. కానీ, వారణాసిలో.. !

సారాంశం

ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసే దిశగా వెళ్తున్నది. ఇటీవలే 36 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 30కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నది. ఇప్పటికే 9 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలుపొందింది. అయితే, ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో మాత్రం బీజేపీ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది.  

లక్నో: ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించే దిశగా పరుగులు తీస్తున్నది. కానీ, అత్యంత కీలకమైన మోడీ సారథ్యం వహిస్తున్న వారణాసిలో మాత్రం ఈ పార్టీ వెనుకబడింది. ఉత్తరప్రదేశ్ శాసన సభకు ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టిస్తూ అధికారాన్ని నిలుపుకున్న సంగతి తెలిసిందే. యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలో బీజేపీ వరుసగా రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విజయం నమోదు చేసుకున్న వారాల వ్యవధిలోనే మరోసారి ఆయన నేతృత్వంలో బీజేపీ ఘన విజయాన్ని రికార్డ్ చేసింది.

ఉత్తరప్రదేశ్ శాసన మండలిలో మొత్తం 100 సీట్లు ఉన్నాయి. ఇందులో ఖాళీగా ఉన్న 36 స్థానాలకు కొన్ని రోజుల కింద ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 30కిపైగా సీట్లల్లో ముందంజలో ఉన్నది. ఇప్పటికే 9 స్థానాల్లో ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది. కానీ, ఫలితాల సరళి ద్వారా బీజేపీ శాసన మండలిలోనూ తన బలమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతున్నట్టు అర్థం అవుతున్నది.

వారణాసి నుంచి బరిలోకి దిగిన అన్నపూర్ణ సింగ్ గెలిచారు. బలమైన స్థానిక నేత బ్రిజేష్ సింగ్ భార్య అన్నపూర్ణ సింగ్ భారీ మెజార్టీతో విజయం నమోదు చేశారు. 2016లో ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిని దించలేదు. ఒకరకంగా అప్పుడు స్వతంత్రంగా బరిలోకి దిగిన బ్రిజేష్ సింగ్‌కు సహకారాన్ని ఇచ్చింది. కానీ, ఈ సారి ఇక్కడ తమ అభ్యర్థిని బరిలోకి దించింది. కానీ, ఈ సారి ఆయన సతీమణిపై బలమైన పోటీని కూడా బీజేపీ ఇవ్వలేకపోయింది. వారణాసి సీటులో బీజేపీ మూడో స్థానంలో నిలిచింది.

ఒక వారణాసి సీటును మినహాయిస్తే.. బీజేపీ ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేసినట్టే. శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇచ్చిన సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలను గెలుచుకుంది. కానీ, అన్ని స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పోటీని ఇవ్వలేకపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగ‌గా..  ఈ నెల 10న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌బ‌డ్డాయి. ఇందులో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింది.   బీజేపీ 255 స్థానాల్లో, దాని మిత్ర ప‌క్షాలు18 స్థానాల్లో విజ‌యం సాధించ‌డంతో 273 సీట్ల మెజార్టీతో యూపీలో మరోసారి అధికారం చేపట్టనున్నది బీజేపీ. ఈ ఎన్నిక‌ల్లో అఖిలేష్ యాద‌వ్ గట్టి పోటీ ఇచ్చిన ఎస్పీ కి 111 సీట్లు, దాని మిత్రపక్షాలకు కేవ‌లం 14 సీట్లు గెలిచాయి. కాగా, తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి సీఎం పదవిని చేపట్టి మరో రికార్డు సృష్టించనున్నారు. ఈ త‌రుణంలో అనేక రికార్డుల‌ను Yogi Adityanathబ్రేక్ చేశారు.  

గ‌తంలో..  యోగీ కంటే ముందు క‌ళ్యాణ్‌సింగ్‌, రామ్ ప్ర‌కాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్ లు బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసినా వారు రెండో సారి అధికారం చేజిక్కించుకోలేక‌పోయారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu