డీఎంకే కు కొత్త నిర్వచనమిచ్చిన బీజేపీ నేత..  డీ అంటే డెంగ్యూ, ఎం అంటే.. 

Published : Sep 07, 2023, 10:56 PM IST
డీఎంకే కు కొత్త నిర్వచనమిచ్చిన బీజేపీ నేత..  డీ అంటే డెంగ్యూ, ఎం అంటే.. 

సారాంశం

డీఎంకేపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్నామలై డీఎంకే పేరును 'డెంగ్యూ, మలేరియా, కోసు'తో పోల్చారు.

సనాతన ధర్మంపై డీఎంకే నేత, స్టాలిన్ కుమారుడు ఉదయనిది స్టాలిన్ చేసిన వాక్యాలపై ఇంకా దుమారం రేగుతూనే ఉంది. ఈ తరుణంలో సీఎం స్టాలిన్ కూడా తన కుమారుడు ఉదయానిది వాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేశాడు. దేశవ్యాప్తంగా ఉదయనిది వ్యాఖ్యలపై అటు బిజెపి, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో డీఎంకే పార్టీతో పాటు ఇండియా కూటమిని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

తాజాగా తమిళనాడు బిజెపి చీఫ్ అన్నామలై .. డీఎంకే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఆ పార్టీకి కొత్త నిర్వచనం ఇచ్చాడు. డీ అంటే డెంగ్యూ, ఎం అంటే మలేరియా, కె అంటే కోసు (దోమ) అని ఆ పార్టీనీ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో డిఎంకె సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని, బిజెపి సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని అన్నమలై  సవాల్ విసిరారు. ఇక తమిళ ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో చూడాలని,  వచ్చే ఎన్నికల్లో డీఎంకే తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. 

డీఎంకే అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిందని, రెండో ఏడాది సనాతన ధర్మాన్ని రద్దు చేయాలని చెబుతుందని, మూడో ఏడాది సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అంటారని, ఇక నాలుగో ఏడాది నువ్వు హిందువా అని ప్రశ్నిస్తారని, ఇక చివరి ఏడాదిలో డీఎంకే లో 90% హిందువులే ఉన్నారని చెబుతున్నారని, డీఎంకే డ్రామాలు అందరికీ తెలుసునని అన్నమలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 17 ఏళ్లుగా ఇలాంటి నాటకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

కొడుకును సమర్థించిన సీఎం స్టాలిన్

అంతకుముందు.. సనాతన ధర్మ గురించి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద ప్రకటనపై రాజకీయ దుమారం చెలారేగుతున్న తరుణంలో  సిఎం ఎం.కె. స్టాలిన్ గురువారం ఆయనను సమర్థించారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళల పట్ల వివక్ష చూపుతున్న  అమానవీయ సనాతన సూత్రాలపై తన కుమారుడు అభిప్రాయాలు వ్యక్తం చేశారని స్టాలిన్ చెప్పారు.

ప్రధానిపై దాడి

ఉదయనిధి ప్రకటనకు తగిన సమాధానం చెప్పాలని ప్రధాని చెప్పినట్లు జాతీయ మీడియా ద్వారా వినడం బాధ కలిగించిందని ఆయన అన్నారు. అయితే ఉదయనిధి గురించి ప్రచారంలో ఉన్న తప్పుడు విషయాలు తెలియకుండా ప్రధాని మాట్లాడుతున్నారా లేక పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నారా? అదే సమయంలో నాపై దాఖలైన కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.

హెచ్‌ఐవితో పోల్చిన డీఎంకే నేత

డీఎంకే నేత, ఎంపీ ఎ. రాజా సనాతన ధర్మాన్ని కుష్టు వ్యాధి, హెచ్‌ఐవి వంటి వ్యాధులతో పోల్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన రాజా.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్య చాలా చిన్నవిషయమన్నారు. మన విషయానికొస్తే..  దీనిని హెచ్‌ఐవి, లెప్రసీ లకు చేసే చికిత్స చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu
PM Modi Inaugurates Safran Aircraft Engine Services India | Modi Speech | Asianet News Telugu