తమిళనాడులో బిజెపి, అన్నాడిఎంకె మధ్య పొత్తు పొడిచింది

First Published Feb 19, 2019, 6:33 PM IST

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తమిళనాడు రాజకీయాలు మరోసారి రక్తి కడుతున్నాయి. ఇప్పటికే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే యూపీఏ(కాంగ్రెస్ కూటమి)తో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే చేరడం ఖాయమైపోయింది. అయితే ఇరు పార్టీల మధ్య గత కొద్ది రోజులుగా సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నా ఓ కొలిక్కి రావడంలేదు.  తాజాగా ఇవాళ ఇరుపార్టీలకు చెందిన అగ్ర నాయకులు మరోసారి సమావేశమై సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి రావడంతో తమిళనాడులో మరో పొత్తు పొడించింది. 

తమిళనాడు రాజకీయాలు లోక్ సభ ఎన్నికల సందర్భంగా మరోసారి రక్తి కడుతున్నాయి. ఇప్పటికే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పార్టీ యూపీఏ(కాంగ్రెస్ కూటమి)తో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే చేరడం ఖాయమైపోయింది. అయితే ఇరు పార్టీల మధ్య గత కొద్ది రోజులుగా సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఇవాళ ఇరుపార్టీలకు చెందిన అగ్ర నాయకులు సమావేశమై సీట్లను సర్దుబాటుపై ఓ నిర్ణయానికి రావడంతో తమిళనాడులో మరో పొత్తు పొడించింది.
undefined
గత రెండు వారాలుగా అన్నాడీఎంకే నేతలతో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయర మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాబీఎంకే కీలక నేత పళని స్వామి, డిప్యూటి సీఎం పన్నీరు సెల్వంలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలు పొత్తుల విషయంలో స్పష్టతకు వచ్చాయి. రాజధాని చెన్నైలో జరిగిన సమావేశం అనంతరం అన్నాడీఎంకే నాయకులతో కలిసి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ఎన్డీఏలో భాగస్వామిగా మారినట్లు వెల్లడించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 21 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న బైపోల్స్ లో అన్నాడీఎంకే అభ్యర్థులకు బిజెపి మద్దుతుగా వుంటుందన్నారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని గోయల్ ప్రకటించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పళని స్వామి, పన్నీరు సెల్వం నాయకత్వంలో ఇరుపార్టీలు కలిసి పనిచేస్తాయని గోయల్ తెలిపారు. అలాగే కేంద్రంలో మోదీ నాయకత్వంలో అన్నాడీఎంకే, బిజెపిలు కలిసి పనిచేస్తాయని పీయుష్ గోయల్ వెల్లడించారు.
undefined
ఈ పొత్తుపై ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నాయకులు పళని స్వామి మాట్లాడుతూ...లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో బిజెపి 5 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. మిగతా చోట్ల అన్నాడీఎంకే అభ్యర్థులకు బిజెపి మద్దతిస్తుందన్నారు. ఇలా తమిళ నాడుతో పాటు పాండిచ్చెరిలో కూడా కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు.
undefined
డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం స్పందిస్తూ...లోక్ సభ ఎన్నికల్లో ఏఐడీఎంకే, బిజెపి ల మధ్య కుదిరిన పొత్తు చారిత్రాత్మకమైందన్నారు. ఈ కలయికతో మరోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు.
undefined
click me!