Bilkis Bano Rape Case: "న్యాయవ్య‌వ‌స్థ‌పై  విశ్వాసం సన్నగిల్లింది" 

By Rajesh KFirst Published Aug 18, 2022, 3:37 AM IST
Highlights

Bilkis Bano Rape Case:  2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బాధితురాలు బిల్కిస్ బానో పై గ్యాంగ్ రేప్‌, ఆమె కుటుంబసభ్యుల హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను బీజేపీ ప్రభుత్వం విడుదల చేయ‌టం క‌లక‌లం రేపుతోంది. ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలు స్పందించింది. 

Bilkis Bano Rape Case:  2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బాధితురాలు బిల్కిస్ బానో పై గ్యాంగ్ రేప్‌, ఆమె కుటుంబసభ్యుల హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను బీజేపీ ప్రభుత్వం విడుదల చేయ‌టం క‌లక‌లం రేపుతోంది. ఈ విష‌యంలో( అత్యాచార దోషుల పట్ల ఎలా) వ్యవహరించాల‌నేది.. కేంద్ర, రాష్ట్ర ప్ర‌బుత్వాల మ‌ధ్య  భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సామూహిక అత్యాచారం కేసులో దోషుల‌ను విడుద‌ల చేయ‌డంపై విప‌క్షాలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. 
 
తాజాగా  ఖైదీల విడుదలపై బాధితురాలు బిల్కిస్ బానో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ‌త రెండు రోజులుగా..( 2022 ఆగస్టు 15 నుంచి)  20 ఏళ్ల క్రితం జరిగిన దుర్ఘటన గుర్తుకు వ‌స్తుంది. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నాశనం చేసిన 11 మంది నేరగాళ్లు విడుద‌ల చేస్తున్నరన‌ప్పటి నుంచి బాధపడుతున్నాయి. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నాశ‌నం చేసిన వారిని ఎలా విడుద‌ల చేశారు. ఆ విష‌యం విని..  షాక్ అయ్యానని తెలిపారు 
 
నేడు అడగదలిచింది ఏమిటంటే.. ఏ స్త్రీకి న్యాయం ఇలా ముగుస్తుంది?  దేశంలోని న్యాయస్థానాలపై నమ్మకం ఉంది,  వ్యవస్థపై నమ్మకం ఉంది ,నా కష్టాలను నేను నెమ్మదిగా పరిష్కరించుకుంటున్నాను.  స‌మాజంతో కలిసి జీవించడం నేర్చుకుంటున్నాను. ఈ ఖైదీల విడుదల మరోసారి నా నుండి శాంతిని దూరం చేసింది. న్యాయంపై నా విశ్వాసం సన్నగిల్లింది అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 ఈ దుఃఖం. అస్థిరమైన నమ్మకం త‌న‌ ఒక్కడిది మాత్రమే కాదనీ, న్యాయస్థానాలలో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి మహిళదని ఆమె చెప్పాడు. దోషులను విడుదల చేయడానికి ముందు త‌న‌ భద్రత గురించి.. ఏమైనా ఆలోచించారా?  అని బిల్కిస్ ప్రశ్న అడిగారు.

బిల్కిస్ బానో గుజరాత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ.. ప్ర‌భుత్వం తమ నిర్ణయాన్నిఉపసంహరించుకోవాల‌ని, త‌న‌కు భయం లేకుండా, ప్రశాంతంగా జీవించే హక్కును తిరిగి ఇవ్వాలనీ, , తద్వారా తాను  శాంతియుతంగా జీవితాన్ని తిరిగి గడుపుతాన‌ని అన్నారు. 

 మార్చి 3, 2002న, గోద్రా అనంతర అల్లర్ల సమయంలోదాహోద్ జిల్లా లింఖేడా తాలూకాలోని రంధిక్‌పూర్ గ్రామంలో బిల్కిస్ బానో కుటుంబంపై ఒక గుంపు దాడి చేసింది. ఆ స‌మ‌యంలో గ‌ర్భ‌వ‌తి అయినా బిల్కిస్ బానోపై  సామూహిక దాడికి పాల్పాడ్డారు. ఈ కేసులో ముంబైలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ప్రత్యేక న్యాయస్థానం జనవరి 21, 2008న బిల్కిస్ బానో కుటుంబ సభ్యులపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది.

click me!