బీహార్ మంత్రి వినోద్ సింగ్: కరోనాను జయించాడు, కానీ....

Published : Oct 12, 2020, 07:32 PM IST
బీహార్ మంత్రి వినోద్ సింగ్: కరోనాను జయించాడు, కానీ....

సారాంశం

బీహార్ మంత్రి వినోద్ సింగ్ సోమవారం నాడు అనారోగ్యంతో మరణించారు. వినోద్ సింగ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. నితీష్ కుమార్ మంత్రివర్గంలో వినోద్ సింగ్ మంత్రిగా ఉన్నాడు.  

న్యూఢిల్లీ:  బీహార్ మంత్రి వినోద్ సింగ్ సోమవారం నాడు అనారోగ్యంతో మరణించారు. వినోద్ సింగ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. నితీష్ కుమార్ మంత్రివర్గంలో వినోద్ సింగ్ మంత్రిగా ఉన్నాడు.

ఈ ఏడాది ఆగష్టు 16వ తేదీన ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.  దీంతో ఆయనను పాట్నాలో ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత అత్యవసర చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మరణించాడు. 

ఈ ఏడాది జూన్ మాసంలో ఆయనకు కరోనా సోకింది. కరోనా నుండి ఆయన కోలుకొన్నారు.  ఆయన మృతి బీజేపీకి దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వినోద్ సింగ్ మరణం తనకు వ్యక్తిగతంగా తీరనిలోటని సీఎం నితీష్ కుమార్ చెప్పారు. వినోద్ సింగ్ అంత్యక్రియలను  అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని  సీఎం ఆదేశించారు.

బీహార్ రాష్ట్రంలో  నవంబర్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 3వ తేదీన తొలి విడత ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?