టీచర్స్ డే:బ్యాలెన్స్ తప్పి కిందపడ్డ బీహార్ సీఎం నితీష్

Published : Sep 05, 2023, 01:42 PM IST
 టీచర్స్ డే:బ్యాలెన్స్ తప్పి కిందపడ్డ బీహార్ సీఎం నితీష్

సారాంశం

పాట్నా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో  బ్యాలెన్స్ తప్పి  బీహార్ సీఎం నితీష్ కుమార్  పడిపోయారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలెర్ట్ అయ్యారు.


పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్  మంగళవారంనాడు పాట్నా యూనివర్శిటీలో జరిగిన  కార్యక్రమంలో కాలు జారి పడిపోయారు.  ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని  పాట్నా యూనివర్శిటీలో  పలు కార్యక్రమాల్లో సీఎం  నితీష్ కుమార్ పాల్గొన్నారు.  గవర్నర్  అర్లేకర్ కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

అయితే  యూనివర్శిటీలో  శంకుస్థాపన  శిలాఫలకం ప్రారంభించే సమయంలో  సీఎం నితీష్ కుమార్  జారిపడ్డారు.పాట్నా యూనివర్శిటీలో  టీచర్స్ డే ను పురస్కరించుకొని ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమానికి సీఎం నితీష్ కుమార్, గవర్నర్ కు ఆహ్వానాలు అందాయి.  యూనివర్శిటీలో కొత్త సెనెట్ హాల్ ను ప్రారంభించేందుకు  సీఎం నితీష్ కుమార్ ,గవర్నర్  వేదికపైకి వెళ్లారు. ఈ హాల్ శిలాఫలాన్ని ప్రారంభించే సమయంలో సీఎం నితీష్ కుమార్ బ్యాలెన్స్ తప్పి కుప్పకూలారు.

 

సెక్యూరిటీ సిబ్బంది  సీఎం నితీష్ కుమార్ ను లేపారు. సీఎం నితీష్ కుమార్  నేలపై పడిపోలేదు. బ్యాలెన్స్ తప్పి పడిపోయే సమయంలో నితీష్ కుమార్ ను  సెక్యూరిటీ సిబ్బంది కాపాడారు. సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో ఆయన మళ్లీ లేచి నిలబడ్డాడు. టీచర్స్ డే ను పురస్కరించుకొని  35 మంది  రిటైర్డ్ టీచర్లు, 21 మంది టీచర్లు, ఇతర సిబ్బందికి అవార్డులు అందించారు సీఎం నితీష్ కుమార్.

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు