పీకలదాకా తాగి మండపానికి వరుడు.. షాకిచ్చిన వధువు

Published : Mar 11, 2019, 04:51 PM IST
పీకలదాకా తాగి మండపానికి వరుడు.. షాకిచ్చిన వధువు

సారాంశం

మరికాసేపట్లో పెళ్లి మండపంలో కూర్చొని.. వధువు మెడలో తాళికట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన వరుడు.. మద్యంలో మునిగితేలాడు. 

మరికాసేపట్లో పెళ్లి మండపంలో కూర్చొని.. వధువు మెడలో తాళికట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన వరుడు.. మద్యంలో మునిగితేలాడు. పీకలదాకా మద్యం తాగి.. పెళ్లి మండపానికి వచ్చాడు. కాగా.. గమనించి వధువు.. నాకీ తాగుబోతు భర్త వద్దంటూ తేల్చి చెప్పింది. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బిహార్‌లోని ఛాప్రా పట్టణానికి చెందిన యువకుడికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. మరో గంటలో పెళ్లి అనగా.. వరుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ మత్తులో ఊగుతూ..తూలుతూనే మండపానికి వచ్చాడు. అది గమనించిన వధువు.. వెంటనే పెళ్లికి నిరాకరించింది. మండపంలోనే పెళ్లిని ఆపేసింది.

అలా పెళ్లి ఆపడాన్ని వరుడు తరపు కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఇక్కడిదాకా వచ్చాక పెళ్లి ఎలా ఆపుతారంటూ మండిపడ్డారు. అయితే.. వధువు కుటుంబసభ్యులు మాత్రం గట్టిగానే బదులు ఇచ్చారు. పెళ్లికే తాగి వచ్చినవాడికి పిల్లని ఎలా ఇస్తామంటూ ప్రశ్నించారు. దీంతో.. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక.. తాగుబోతు వరుడిని పట్టుకొని.. తిరుగు పయనమయ్యారు. 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు