ఘోర ప్రమాదం.. కారు లోయలోపడి..8మంది మృతి

Published : Nov 22, 2019, 08:45 AM IST
ఘోర ప్రమాదం.. కారు లోయలోపడి..8మంది మృతి

సారాంశం

ఓ కుటుంబానికి చెందిన 8 మంది ప్రయాణికులు కారులో వేగంగా వెళుతుండగా మొహభత్తా పట్టణ సమీపంలోని లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఓ బాలుడు అక్కడికక్కడే మరణించారు. 

కారు లోయలో పడి 8మంది మృతి చెందిన సంఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి కారు వేగంగా వస్తూ అదుపుతప్పి లోయలో పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని మొహభత్తా పట్టణ సమీపంలో గురువారం రాత్రిఈ ప్రమాదం జరిగింది. ఓ కుటుంబానికి చెందిన 8 మంది ప్రయాణికులు కారులో వేగంగా వెళుతుండగా మొహభత్తా పట్టణ సమీపంలోని లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఓ బాలుడు అక్కడికక్కడే మరణించారు. 

లోయలో నుంచి మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చామని జిల్లా ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ చెప్పారు. మృతదేహాలకు శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి వారి బంధువులకు అప్పగిస్తామని కలెక్టరు శిఖా రాజ్ పుత్ తివారీ చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.25వేలను అందించామని కలెక్టరు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ
సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People